మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దాదాపు 270 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న మెగా మూవీ సైరా. 2019లో తెలుగు పరిశ్రమ నుంచి వస్తున్న రెండో అత్యంత భారీ సినిమా. అక్టోబర్ 2న విడుదలవుతున్న ఈ మెగాస్టార్ సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నాలుగు ప్రధాన భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా మెగాభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఈ సినిమాలోని కొన్ని హైలైట్స్ ఇవేనని లేటెస్ట్ న్యూస్. 

సినిమా ప్రారంభంలో ఝాన్సీ లక్ష్మీ భాయి పాత్రలో హీరోయిన్ అనుష్క కనిపించబోతోంది. అనుష్క ద్వారనే సైరా నరసింహారెడ్డి కథ ప్రారంభమవుతుంది. సినిమాలో సైరా నరసింహారెడ్డి అనే టైటిల్ సాంగ్ 5 నిముషాల 30 సెకన్ల కు పైగా వుంటుందని తెలుస్తోంది. అంతే కాదు ఈ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాయడం విశేషం. 
సినిమాలో అత్యంత కీలకమైన అండర్ వాటర్ యాక్షన్ పార్ట్ ఒకటి వుంటుంది. తమన్నా-చిరంజీవి- ఫైటర్ల మధ్య వుండే ఈ యాక్షన్ పార్ట్ కోసం భారీగా ఖర్చు చేసారు. హాలీవుడ్ టెక్నీషియన్లు యాక్షన్ పార్ట్ ని కంపోజ్ చేశారు.

ఇక ఈ సినిమా క్లయిమాక్స్ ఎంతో ఎమోషనల్ గా కంప్లీట్ డైలాగ్ బేస్డ్ గా వుంటుంది కాబట్టి, ప్రీ క్లయిమాక్స్ ఫుల్ యాక్షన్ తో వుండబోతోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం కోట్లలో ఖర్చు చేసారు. అంతే కాదు క్లయిమాక్స్ లో మెగాస్టార్ ఎంతో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్తారు. సినిమా ఫస్ట్ పార్ట్ నరసింహారెడ్డి జమీందారీ జీవితం, ఆ విలాసాలు తదితర అంశాలతోను, సెకండ్ పార్ట్ లో అసలు పోరాట గాధ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక సైరాలో జాతర పాట కూడా ఎంతో ప్రత్యేకంగా వుంటుంది. అది మెగా మాస్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. సినిమాలో ఏ సీన్ అయినా కూడా తెరనిండా మనుషులు. సెట్ ప్రాపర్టీస్ భారీగా వుండి పెట్టిన ఖర్చు మొత్తం క్లియర్ గా కనిపిస్తూ వుంటుంది.
అంతేకాదు పవర్ స్టార్ వాయిస్ వోవర్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్. దీంతో పాటు నాగబాబు కూతురు నిహారిక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషించింది. మొదటి సారి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: