సూపర్ స్టార్ రజినీకాంత్ , అక్షయ కుమార్ , శంకర్ ల కలయికలో విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన చిత్రం  2.0.  గత ఏడాది నవంబర్ 29న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 500కోట్ల  వసూళ్లను  రాబట్టింది. అయితే  విడుదలకు ముందు ఈ చిత్రం, బాహుబలి 2 ని క్రాస్ చేస్తుందన్నారు కానీ  దాని దారిదాపుల్లోకి  కూడా రాలేకపోయింది.  తమిళ ,హిందీ వెర్షన్ లు మాత్రమే లాభాలు తీసుకొచ్చాయి.  కానీ తెలుగు లో మాత్రం 2.0 బయ్యర్లకు నష్టాలే మిగిల్చింది. 




ఇక ఈ చిత్రాన్నీ తాజాగా చైనాలో  ఈనెల 6న  4000 కు పైగా స్క్రీన్ లలో విడుదలచేయగా మొదటి వారాంతంలో 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లను మాత్రమే రాబట్టి నిరాశ పరించింది. విజువల్స్ కంటే  కంటెంట్  వున్న  చిత్రాలనే  చైనా ప్రేక్షకులు  ఆదరిస్తారని మరో సారి ఈ చిత్రంతో  రుజువైంది.  దాంతో 2.0 అక్కడ యావరేజ్  చిత్రంగానే మిగిలిపోనుంది.  ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్నిసుమారు 400కోట్ల భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.




కాగా  చైనా లో ఇప్పటివరకు  విడుదలైన భారతీయ చిత్రాల్లో  బాలీవుడ్ సూపర్ స్టార్  అమీర్ ఖాన్ నటించిన దంగల్ 1200కోట్ల వసూళ్లతో  అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా  రికార్డు సృష్టించింది.  దీనితరువాత సీక్రెట్ సూపర్ స్టార్ రెండవ స్థానంలో ఉండగా ఇటీవల విడుదలైన  అందదున్ మూడో స్థానంలో నిలిచింది.  ఈ చిత్రం  'పియానో ప్లేయర్' అనే  టైటిల్ తో ఈఏడాది సమ్మర్ లో  విడుదలై  కేవలం మూడు వారాల్లోనే  300కోట్ల వసూళ్లను రాబట్టి  భజరంగి బాయ్ జాన్ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: