ఆర్ఎక్స్ 100 అనే చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుమ్మకొండ కార్తికేయ, ఆ సినిమాలో ఆకట్టుకునే నటనతో పెద్ద విజయాన్ని అందుకుని, ప్రేక్షకుల నుండి మంచి మార్కులే సంపాదించాడు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఫీల్ గుడ్ స్టోరీ గా గత ఏడాది తెరెకెక్కిన ఆ సినిమా, సూపర్ హిట్ సాధించింది. ఇక సినిమాలో హీరో కార్తికేయ మరియు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో యూత్ మరియు మాస్ ఆడియన్స్ ఆ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక దాని తరువాతత ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ఒక నెగటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్న కార్తికేయ, 

అతి త్వరలో తన హోమ్ ప్రొడక్షన్ లో మరొక సినిమా చేయబోతున్నాడు. ఇంతకముందు ఆర్ఎక్స్ 100 సినిమాను నిర్మించిన తమ సంస్థ నుండి అతి త్వరలో తెరకెక్కబోయే కొత్త సినిమాకు 90 ML 'ఆధరైజ్డ్ డ్రింకర్' అనే డిఫరెంట్ టైటిల్ ని నిర్ణయించడం జరిగింది. నూతన దర్శకుడు శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి రెండు రోజుల క్రితం, పాల సీసాలో మందు, దాన్ని పట్టుకోవడానికి పసివాడు ప్రయత్నిస్తున్న ఒక ప్రీ రిలీజ్ పోస్టర్ ని రిలీజ్ చేసి అందరిలోనూ మంచి ఆసక్తి రేకెత్తించారు. ఆర్ఎక్స్ 100 విజయం తర్వాత కార్తికేయ హిప్పి, గుణ 369 చిత్రాలు చేశారు. 

అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోవడంతో త్వరలో తెరకెక్కబోతున్న ఈ '90 ML' మూవీపైనే అన్ని ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా, విభిన్నమైన కథ మరియు కథనాలతో తెరకెక్కనున్న సినిమాను కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తుండగా, అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. కాగా ఈ సినిమాలో నటించియే హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: