బిగ్ బాస్ హౌస్ .. ఒకప్పుడు వివాదానికి కేర్ అప్ అడ్రెస్స్ అంటే ఇప్పుడు ఎమోషన్స్ కి కేర్ అఫ్ అడ్రెస్స్ అంటున్నారు. ఆలా అనడానికి కారణం అలీ రెజా అనే చెప్పచు. అలీ రెజా .. బిగ్ బాస్ హౌస్ లో అర్జున్ రెడ్డి అని చెప్పే వారు. అర్జున్ రెడ్డి అని ఎందుకు అన్నారంటే అతనికి చెప్పలేనంత కోపం .. ఏదైనా భరిస్తాడు కానీ కోపాన్ని మాత్రం అస్సలు భరించలేడు ఈ అలీ రెజా. 


అందుకే ఆరు వారాల నుంచి నామినేషన్స్ నుంచి తప్పించుకున్న ఏడో వారంలో మొదటిసారి నామినేషన్ అయ్యి అలాగే ఎలిమినేట్ అయ్యాడు మన అలీ రెజా. అసలు అలీ రెజా ఎలిమినేట్ అవుతాడని ఎవరు ఊహించలేదు.. అనుకోకుండా ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళాడు. ఒకలా చెప్పాలంటే.. అలీ రెజా వెళ్లడం లోపల ఏ కాంటస్టెంట్ కి నచ్చలేదు. 


ఎవరైనా ఎలిమినేట్ అయితే పీడా విరగడైంది అనుకుంటారు కానీ అలీ రెజా వెళ్తుంటే శత్రువులు కూడా కళ్ళ నిండా నీళ్లు పెట్టేసుకున్నారు. వెళ్లే వరుకు తెగ ఏడ్చేశారు. ఒకొక్కరు ఒక్కో విధంగా అతను వెళ్ళిపోయినందుకు ఫీల్ అయ్యారు. వాళ్ళ ఏడుపు చూసి ప్రేక్షకులు అందరు కూడా ఏడ్చేశారు అంత భాద అనిపించింది అలీ రెజా వెళ్లిపోయానంటే. 


అందుకే ప్రేక్షేకుల కోరిక మేరకు అలీ రెజా మళ్ళి తిరిగి బిగ్ బాస్ ని ఇంటిలోకి పిలిచారట. దీంతో మరో రెండు రోజుల్లోనే అలీ రెజా బిగ్ బాస్ హౌస్ లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి అలీ రెజా నిజంగా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడా లేదా అనేది త్వరలోనే తెలియనుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: