మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వీలన్ గా నటిస్తున్న సినిమా "వాల్మీకి".ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.వాల్మీకి ట్రైలర్ లాంచ్ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు
.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ... సాధారణంగా మన సినిమాల్లో హీరో అంటే మంచి వాడు అందరికి మంచి చేస్తాడు.ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు, వీలన్స్తో ఫైట్ చేస్తాడు. ఒక నటుడిగా అవన్ని చేశాను. నాకు ఎప్పుడు కొత్త క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది.అలా చేయాలంటే నటుడిగా నాకున్న సరిహద్దులను దాటి పాత్రలను వేయ్యాలి.గద్దలకొండ గణేష్ పాత్ర నాకు ఆ అవకాశన్ని ఇచ్చింది.ఈ పాత్రను హరీష్ గారు చాలా బాగా రాసారు. సినిమాల్లో వీలన్ పాత్రలు చేయడం అంటే  నాకు ఇష్టం.ఆ పాత్రలకు ఎక్కువగా అభినయనికి స్కోప్ ఉంటుంది.

ఈ పాత్ర అనుకున్నప్పుడు నన్ను  విలన్ గా అక్సెప్ట్  చేస్తార అనుకున్న. అందుకోసం నేను, హరీష్ శంకర్ గారు చాలా రోజులు కష్టపడి ఈ లూక్ ని డిజైన్ చేశాం.ఫస్ట్ లూక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అందరు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు . అప్పుడు హమ్మయ్య అనుకున్నం.సినిమాలో నటించేటప్పుడు తెలియలేదు కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు నేనేనా అంత వైలెంట్ గా చేసాను అని అనుకున్న
.  
హరీష్ శంకర్ మాట్లాడుతూ..వరుణ్ ఈ సినిమాలో తన వయసుకు మించిన పాత్ర చేశాడు, అది ధైర్యం అని చెప్పాలి.మిక్కి.జె.మేయర్ ఈ సినిమాకి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. మిక్కి కి మామూలుగా మెలోడి పాటలు మాత్రమే చేస్తాడని ఇమేజ్ ఉంది.ఈ సినిమాతో ఆ ఇమేజ్ పూర్తిగా పోతుంది అని చేప్పారు. వాల్మీకి ని  14 రీల్స్ బ్యానర్పై రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తున్నారు.ఈ నెల 20 విడుదల అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: