న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ఇంకో మూడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. జెర్సీ వంటి హై ఎమోషనల్ డ్రామా తర్వాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ ని నాని అభిమానులు గ్యాంగ్ లీడర్ సినిమాలో ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టే కామెడీతో పాటు యాక్షన్ డ్రామా కూడా బాగా జోడించినట్టు ట్రైలర్ లో చూపించడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఇందులో ఐదుగురు లేడీ గ్యాంగ్ ని విక్రమ్ కుమార్ సెట్ చేసిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ అప్ డేట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆ న్యూస్ ప్రకారం నాని ఈ సినిమాలో డ్యూయల్ రోల్ ఉండొచ్చని తెలుస్తోంది. ఒక రోల్ కాస్త నెగటివ్ షేడ్స్ తో ఉండగా రెండోది ప్రమోషన్ లో చూసిన జాలీగా, సరదాగా నవ్విస్తూ ఉండే కామిక్ పాత్రని సమాచారం. అంతే కాదు ఒక పాత్రకు విలన్ గా చేస్తున్న కార్తికేయకు ఏదో బలమైన కనెక్షన్ కూడా ఉంటుందని ఇన్‌సైడ్ న్యూస్. నాని ఇంతకు ముందు మూడు సార్లు డ్యూయల్ రోల్ చేశాడు. జెండాపై కపిరాజు - జెంటిల్ మెన్ - కృష్ణార్జున యుద్ధం.  

మొత్తం ఇలా మూడు సినిమాల్లో డ్యూయల్ రోల్ లో నటించాడు. కానీ జెంటిల్ మెన్ మాత్రమే వర్క్ అవుట్ కాగా మిగిలిన రెండు ఫ్లాపయ్యాయి. ఇప్పుడీ గాసిప్ నిజమే అయితే కనక గ్యాంగ్ లీడర్ ఈ వరుసలో నాలుగో సినిమా అవుతుంది. అఫీషియల్ న్యూస్ కానప్పటికీ ఇన్ సైడ్ టాక్ కాబట్టి ఇది విన్న నాని ఫ్యాన్స్ నిజమైతే బాగుండు అని కోరుకోవడం సహజం. తనదైన టైమింగ్ తో సాధారణ కథలను కూడా నిలబెట్టే నాని ఇప్పుడీ ఛాలెంజింగ్ సబ్జెక్టు లాంటి గ్యాంగ్ లీడర్ తో ఎలా మెప్పిస్తాడో చూడాలి. అంతేకాదు సెంటిమెంట్ పరంగా కూడా నాని ఫ్యాన్స్ లో చిన్నపాటి భయం కూడా ఉంది. అదే డ్యూయల్ రోల్.  


మరింత సమాచారం తెలుసుకోండి: