ఆర్డీఎక్స్ లవ్.. ఈ సినిమా ప్రమోషన్ మొదటి నుంచి కూడా హీరోయిన్ రాజ్ పుత్ అందాల ప్రదర్శన ఆధారంగానే సాగింది. ఆరెక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ కు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకే ఈ సినిమా నిర్మిస్తున్నారా అన్నట్టు అనిపించింది. ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ కూడా అదే రేంజ్ లో వస్తోంది.


మొదట్లో పాయల్ రాజ్ పుత్ ను ఓ అందాల నెరజాణగా చూపిస్తూ పోస్టర్లు రిలీజ్ చేశారు. కేవలం పాయల్ రాజ్ పుత్ అందాలనే పెట్టుబడిగా పెట్టి సినిమా తీస్తున్నారా అనిపించారు. ఆ తర్వాత వచ్చిన టీజర్లోనూ అంతా బూతు కామెడీయే పెట్టడంతో ఇదేదో అడల్డ్ కామెడీ మూవీ అనిపించారు.


కానీ ఇప్పుడు విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అసలు కథను రివీల్ చేస్తున్నారు సినీ నిర్మాత, దర్శకులు. తాజాగా విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూసినవారికి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఉన్న జోనర్ కాకుండా కొత్త జోనర్ లో ఈ సినిమా సాగుతుందా అనిపిస్తోంది. తాజా ట్రైలర్ చూసిన వారికి ఇదో ఊరి సమస్యపై తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ గా కనిపిస్తుంది.


ఓ సీరియస్ స్టోరీకి సుగర్ కోటెడ్ గా పాయల్ రాజ్ పుత్ అందాలను వాడుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యూహం కరెక్టా కాదా అన్నది సినిమా చూస్తే కానీ తెలీదు. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తే పాయల్ రాజ్ పుత్ పై ఇప్పటివరకూ ఉన్న నెగిటివ్ ఫీలింగ్ మాయం కావడం ఖాయం. అయితే ఇలాంటి సీరియస్ సబ్జక్ట్ ఉన్నప్పుడు అందాల ప్రదర్శనతో ప్రచారంతో ప్రేక్షకులు కన్ ప్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇదేదో బూతు సినిమా అనుకుని ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చిన వారు కచ్చితంగా థియేటర్ వైపు వచ్చే ఛాన్స్ లేదు. మరి నిర్మాత, దర్శకుల వ్యూహం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: