చాలామంది హీరోయిన్లు ముందు మోడలింగ్, ఆ తర్వాత హీరోయిన్ గా రాణిస్తారు. ఒక్కసారి హీరోయిన్ గా అవకాశాలు తగ్గితే వాణిజ్య ప్రకటనలు, మ్యాగ్జైన్స్ మీద కవర్ పేజీకి ఫోజిలిస్తు సంపాదించుకోవడానికి ట్రై చేస్తారు. ఇక అవి కూడా తగ్గాయంటే సంపాదనకోసం కనిపించిన ప్రతి దారి వెతుక్కుంటారు. అలానే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ తారా సుతారియా హాట్ హాట్ ఫోజులిస్తు అందాలను ప్రదర్శిస్తోంది. ఇక వాస్తవంగా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఇరవైల్లో ఉండే హీరోయిన్ల కంటే ముప్పైలలో నలభైల్లో ఉండే లేటు వయసు భామల హాట్ హంగామా చూసి నెటిజన్లు షాకవుతున్నారు. 

ముఖ్యంగా అమీషా పటేల్, మలైకా అరోరా, శిల్పా శెట్టి, సుస్మితా సేన్ తదితరులు ఈ లిస్ట్ లో ఉన్నారు. వీళ్ళు ఎంత ఫిట్నెస్ మెయిన్టెయిన్ చేసినా.. ఓ నెల రోజులు హెయిర్ కలర్ కనుక వెయ్యకపోతే అసలు బండారం బయటపడుతుంది. అందులో సందేహమే లేదు. అయితే యంగ్ హీరోయిన్స్ కూడా ఈ మధ్య 40 ఏళ్ళ హీరోయిన్స్ తో పోటీకి సై అంటున్నారు. సారా అలీ ఖాన్.. జాన్వి కపూర్.. అనన్య పాండే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదే ఉంది.  ఈ లిస్టులో ఉన్న మరో హాట్ బ్యూటి తార సుతారియా.

తార సుతారియా కరణ్ జోహార్ పరిచయం చేసిన హీరోయిన్. ఆయన నిర్మించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' తారకు బాలీవుడ్ లో డెబ్యూ మూవీ. మొదటి సినిమాకు పరవాలేదు అనిపించుకున్నఈ బాలీవుడ్ బ్యూటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన హాట్  ఫోటోలతో టెంపరేచర్ పెంచే ప్లాన్ మొదలు పెట్టింది. మ్యాగజైన్ కవర్ పేజీలను కూడా వదలకుండా తన హాట్ ఫోజులతో జనాలకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఎగ్జిబిట్ మ్యాగజైన్ సెప్టెంబర్ ఎడిషన్ కవర్ పేజికి పోజిచ్చి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఈ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ "నా శిరోజాలను గాలి తాకుతుంటే..నా హృదయంలో పాట వినిపిస్తుంటే" అంటూ కవితాత్మకంగా ఒక క్యాప్షన్ రాసింది. ఈ ఫోటో షూట్ చేసిన ఫోటోగ్రాఫర్ మరెవరో కాదు బాలీవుడ్ హీరోయిన్స్ శ్రద్ధ కపూర్ బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠ.

ఇక ఈ మ్యాగజైన్ లో 'తారా సుతారియా: ది బ్లేజింగ్ స్టార్' అనే టైటిల్ తో ఒక కథనం కూడా ప్రచురించారు. ఈ  ఫోటోలో బ్లాక్ అండ్ వైట్ టాప్.. వైట్ కలర్ స్కర్ట్ లో సడెన్ గా చూస్తే తారను ఒక హాలీవుడ్ హీరోయిన్ అనుకోవడం ఖాయం.  ఇక నెటిజన్లు కూడా తెగ రెచ్చిపోయి "రెడ్ హాట్ బ్యూటీ".. "ఫ్రాంక్లీ ఫ్యాబులస్".. "కొత్త  బాలీవుడ్ ప్రిన్సెస్".. "స్టన్నింగ్ డ్రెస్.. సూపర్ పోజ్' అంటూ రక రకాల కామెంట్లు పెట్టారు. ఇక తారా సుతారియా  ప్రస్తుతం 'మర్జావా' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా గనక హిట్టైతే మాత్రం తారను ఇక ఎవరు ఆపలేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: