చరిత్ర పుటల్లో కనుమరుగయ్యిపోయిన తెలుగు గడ్డకు చెందిన వీర విప్లవకారుడు “ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి”  జీవితం ఆధారంగా  మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో సుమారు 10 భారీ యాక్షన్ సీక్వెన్స్ స్ ఉంటాయట.  వీటిలో ఒకటి ఇంటెర్వెల్ ముందు, ఇంకొకటి సినిమా ముగింపులో  ప్రీ క్లైమాక్స్ లో వస్తుందట.  కాగా ఇంటర్వెల్  సమయానికి ముందు వచ్చే ఫైట్ అండర్ వాటర్ ఫైట్ అట.  ఇది సినిమాకే ప్రత్యేకంగా హైలెట్ గా  నిలుస్తుందని తెలుస్తోంది.  ముంబైలో షూట్ చేసిన ఈ ఫైట్ కోసం చిరు చాలా కష్టపడ్డారు.  ఇక చివరి ఫైట్ అన్నిటికంటే పెద్దదని, భారీ వ్యయంతో, ఎక్కువమంది సభ్యులతో దాన్ని షూట్ చేశారు. ఇక ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు 17 దేశాల్లో జరుగుతున్నాయి. మొత్తానికి ఇవ్వన్నీ పరిశీలిస్తే  'సైరా' కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది.  ఇక సుమారు 5 భాషల్లో భారీ ఎత్తున విడుదలవుతున్న ఈ చిత్రం యొక్క హక్కులకు అన్ని భాషల్లోనూ డిమాండ్ అధికంగానే ఉంది.  దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనే పలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు మెగాస్టార్.  పైగా ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌,  సినిమా పై అమాంతం అంచనాలను పెంచేసింది.  ఇక నిర్మాత రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. 


మరి అలాంటప్పుడు, ఈ సినిమా  ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా  భారీ స్థాయిలోనే జరుగుతుంది కదా.  మెగా స్టామినాను ఏమాత్రం తక్కువ చెయ్యని రీతీలోనే  అన్ని  భాషల్లోనూ ఇప్పటికే భారీగా బిజినెస్ ను  జరుపుకుంది సైరా.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ చిత్రం.  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు.  అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.  ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది.  రామ్ చరణ్  ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో  విడుదల చేయనున్నారు.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: