పూరి జగన్నాధ్..నర్సీ పట్నం నుంచి పాతిక వేలు జేబులో పెట్టుకొని హైదరాబాద్ వచ్చాడు. ఎలాగోలా బ్రతికేద్దామని మాత్రం కాదు. ఈ విషయం పూరి సినిమాలను చూస్తే అర్థమవుతుంది. వేకువ జామున నాలుగు గంటలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కథ చెప్పి బద్రి తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంతే ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు. చూడాల్సిన అవసరం కూడా రాలేదు. ఒక దర్శకుడిగా అతి తక్కువ కాలంలోనే దాదాపు 100 కోట్లు సంపాదించాడు. ఇంత సంపాదన ఇండస్ట్రీలో మరే దర్శకుడు సంపాదించలేదనే చెప్పాలి. అంతేకాదు ఈ విషయం కూడా ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. 

ఇక ఆ తర్వాత పూరి లైఫ్ జర్నీ గురించి తెలిసిందే. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని స్నేహితులు అనుకున్న వాళ్లు మోసం చేశాక సంపాదించుకున్నవన్నీ పోగొట్టుకున్నారు. ఎలాగోలా తిరిగి సినిమాలతోనే మళ్ళీ అంటూ బయటపడ్డారు. నిజాయితీకి, నిఖార్సుతనాకి మరో పేరు పూరి. అందుకే ఏ హీరోతో ఎలాంటి సినిమాను తీసిన డేరింగ్ అండ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు తెలిసిందల్లా సినిమా తీయడం ఒక్కటే. అదే తిరిగి జీరో నుంచి హీరోని చేసిందని పూరీ చాలా సందర్భాల్లో చెప్పారు. అది నిజమే. 100 కోట్లు పోయి అప్పులు నెత్తిమీద పడ్డాక ఎవరు మాత్రం బ్రతకడానికి ధైర్యం చేస్తారు. కానీ పూరీ అందరిలా హైదరాబాద్ కి మెల్లగా ఏదోలా బతికేయడానికి రాలేదన్నది అందరికీ  ఆ తర్వాతే తెలిసిన నిజం. 

పరిశ్రమ అగ్ర హీరోలందరినీ డైరెక్ట్ చేసిన పూరి మహేష్ తో పోకిరి- బిజినెస్ మేన్ లాంటి క్రేజీ సినిమాల్ని తీశారు. కానీ పూరీ కష్టాల్లో ఉన్నప్పుడు మహేష్ తో సహా చాలా మంది హీరోలు కథ చెబితే నో చెప్పారు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నే డైరెక్ట్ చేసిన పూరీకి హీరోని పట్టుకోవడం ఒక లెక్క..కానే కాదు..అందుకే రామ్ ని ఊర మాస్ హీరోగా మలిచి ఇస్మార్ట్ శంకర్ తో టాలీవుడ్ లో లెక్కలు తిరగ రాశారు. ఈ దెబ్బతో హీరోలైతే నో అన్న వాళ్ళే పూరి కోసం ఎదురుచూస్తున్నారు..అది పూరి స్టామినా..పవర్.



మరింత సమాచారం తెలుసుకోండి: