జెర్సీ సినిమాలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ అందరికి గుర్తుంటుంది. తాజాగా ఆమె ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆమె పిల్లలను కనకూడదని డిసైడ్ అయ్యారు. తన దృష్టిలో రేప్ అన్నది మాత్రమే నేరం కాదని… కాలం మారుతున్నా… మహిళలపై సమాజం చూసే దృష్టిలో ఏ మాత్రం మార్పులేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.


సమాజంలో మహిళలను తక్కువ దృష్టిలో చూసేవాళ్లు ఇప్పటికీ ఎక్కువ మందే ఉన్న నేపథ్యంలో కొందరు మహిళలు వివాహాలకే దూరంగా ఉంటున్నారు. తాజాగా, ఆ లిస్ట్ లో  శ్రద్ధా శ్రీనాథ్ కూడా చేరిపోయారు. ఆమె తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా మంది రేప్ అన్నది మాత్రమే నేరంగా చూస్తారని… అయితే మహిళలను తప్పుడు దృష్టితో చూడడం..అనుసరించడం కూడా నేరంగా అని చెప్పింది. కాలంతో పాటు మహిళల్లో కూడా మార్పు వస్తోందని… ఈ క్రమంలోనే తాను అస్సలు పిల్లలను కనకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు ఆమె స్పష్టం చేసింది.


తాజాగా ఈ భామ 'నేర్కొండ పార్వాయ్' అనే సినిమాలో నటించింది. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతి పాత్రలో నటించింది శ్రద్ద శ్రీనాథ్. ఈ సినిమా హిందీలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్. తాజాగా శ్రద్ధా శ్రీనాథ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సమాజంలో మహిళలపై జరిగే నేరాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.


మహిళలపై జరిగే లైంగిక నేరాల గురించి ఇప్పటికీ సమాజంలో సరైన అవగాహన లేదన్నారు. కేవలం అత్యాచారాన్ని మాత్రమే నేరంగా పరిగణిస్తున్నారని, తప్పుడు ఉద్దేశ్యంతో స్త్రీని సంప్రదించడం కూడా లైంగిక నేరమే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మహిళలు పోలీస్ స్టేషన్ వెళ్ల ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం వీటిని ఎలా స్వీకరిస్తారో అని భయం వాళ్లలో ఉంది ? కోర్టుల్లో ఈ కేసులు ఆలస్యం అవుతాయనే కారణంతో చాలా మంది వెళ్లడం లేదన్నారు శ్రద్ద. లైంగిక వేధింపులు జరిగినపుడు ఆ వ్యక్తి ఎక్కడ తాకాడు, ఎలా తాకాడు అనే ప్రశ్నలు అడగటం మానేయాల న్నారు.  అలా అడగటం వల్ల బాధితులు ఇబ్బంది పడతారంది.  ఇలాంటి విషయాల్లో సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.  కానీ వారిపై ఉండే ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు' అని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: