తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంతటి స్టార్ డమ్ ఉన్న ఈ మాస్ హీరో కి సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ వరుస బెట్టి వస్తున్నాయి. ఈ స్టార్ హీరో చేసిన కత్తి సినిమానే మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీగా తెలుగులో ఖైదీ నంబర్ 150 గా వచ్చి సూపర్ హిట్టయింది. ఇక విజయ్ సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. తమిళంలో రిలీజ్ కాబోతున్న ప్రతీ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి వదులుతున్నారు. తెలుగులో ఇంతకముందు సూర్య కున్న మార్కెట్ ఇప్పుడు విజయ్ కి ఉండటం విశేషం.

తమిళంలో బిజిల్, తెలుగులో విజిల్ పేరుతో సినిమా చేస్తున్నాడు తమిళ యంగ్ సూపర్ స్టార్ విజయ్. మాస్ డైరక్టర్ అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో విజయ్ కున్న పాపులారిటి దృష్ట్యా ఈ సినిమా తెలుగు హక్కుల కోసం ఇద్దరు ముగ్గురు రెడీ అయ్యారు. దాంతో రేటు కాస్త ఎక్కువగానే చెప్పారని లేటెస్ట్ న్యూస్. అందువల్ల ఇన్ని రోజులు రేటు విషయం లో ఊగిసలాడుతు ఇప్పటికి సెటిల్ అయిందని తెలుస్తోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మహేష్ కోనేరు ఈ సినిమా తెలుగు థియేటర్ హక్కులను, చిత్తూరు జిల్లాకు ప్రత్యేకంగా తమిళ వెర్షన్ థియేటర్ హక్కులను తీసుకున్నారు. తమిళ వెర్షన్ నిర్మాతలు మొదట్లో పదికోట్ల వరకు చెప్పారని తెలుస్తోంది. కెఎఫ్సీ, సుధాకర రెడ్డి ఇలా పలువురు ఆసక్తి చూపించినా, రేటు చుక్కలు చూపించడంతో వెనక్కు తగ్గారు. 

అయితే మొత్తానికి ఇప్పుడు ఏడుకోట్ల కు సెటిల్ అయినట్లు తాజా సమాచారం. ఇక వచ్చే దీపావళికి ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారని ఫ్రెష్ అప్‌డేట్. దీంతో తెలుగులో రాబోతున్న వెంకీమామకు షాక్ తగిలింది. వెంకీ-నాగచైతన్యల వెంకీమామకు సోలో డేట్ అనుకుంటే, ఇప్పుడు విజయ్-అట్లీల విజిల్ పోటీకి రెడీ అవుతోంది. విజయ్ కు తెలుగులో మార్కెట్ బాగానే వుంది. ఒకవేళ  సినిమాకు హిట్ టాక్ వస్తే వెంకీమామకు పోటీ గట్టిగానే తగులుతుంది. ఇదిలావుంటే ఇదే డేట్ కు మరో తమిళ హీరో కార్తి సినిమా కూడా రెడీ అవుతోందని మరో న్యూస్. ఈ లెక్కన వెంకీమామకు రెండు తమిళ సినిమాల నుంచి పోటీ ఎదురవబోతోందన్నమాట. మరి ఈ పోటీలో వెంకీమామ తట్టుకొని నిలబడుతుందా లేదా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: