సినీ ఇండస్ట్రీలో తెరపై నటించడంతో పాటు చాలా మంది నిజ జీవితాల్లోనూ నటించేస్తుంటారు.. పాత్ర కోసం అలా చేశామని.. కథ డిమాండ్ చేసిందని కబుర్లు చెబుతుంటారు. ప్రత్యేకించి హీరోయిన్లు.. అందాల ప్రదర్శన చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి రొటీన్ డైలాగులు చెబుతుంటారు. కథ కోసం అలా చేయాల్సి వచ్చిందని.. ఆ సీన్ సినిమాకు ప్రాణమని హరికథలు వినిపిస్తుంటారు.


కానీ కొందరు నటీనటులు మాత్రం ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేస్తుంటారు. అలాంటి వారిలో రాధికా ఆప్టే ఒకరు. యథార్దవాది లోకవిరోధి అన్నట్టు అందుకేనేమో రాధికా ఆప్టే చుట్టూ వివాదాలు ఉంటుంటాయి. నిజాల్ని నిర్భయంగా చెబుతుందన్న పేరు కూడా ఈమెకు ఉంది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కేరీర్ తొలినాటి రోజులను గుర్తు చేసుకున్నారు.


ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించింది. అప్పట్లో తనకు పెద్దగా సినిమాలు వచ్చేవి కావని.. డబ్బు కూడా చాలా తక్కువ ఇచ్చేవారని గుర్తు చేసింది. అందుకే ఆ సమయంలో తాను డబ్బు కోసం న్యూడ్ పాత్రలు కూడా చేసేందుకు ఒప్పుకున్నానని డేరింగ్ గా చెబుతోంది. చేసినప్పుడు చెప్పడంలో తప్పేముందని అంటోంది.


నేను ఇండస్ట్రీలో ఏం చేసినా కూడా నేను డబ్బు కోసమే చేశానంటూ నిర్మొహమాటంగా రాధిక ఒప్పేసుకుంటోంది. ఇప్పుడు ఈమె చెప్పిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. గతంలోనూ రాధికా ఆప్టే ఇలా డేరింగ్ గా మాట్లాడేది. ఆ మధ్య సౌత్ హీరోల గురించి కూడా ఈ అమ్మడు షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతే కాదు.. కాస్టింగ్ కౌచ్ గురించి కూడా నిర్భయంగా నోరు విప్పిన అతి కొద్ది మంది హీరోయిన్లలో రాధికా ఆప్టే ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ తో పాటు పలు భాషల్లో మంచి ఆఫర్లే దక్కించుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: