బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  దీపికా పదుకొనె స్పోర్ట్స్ రంగం నుంచి మోడల్ గా ఎదిగి అక్కడి నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. 2006 వ సంవత్సరంలో ఆమెకు సినిమా అవకాశం వచ్చింది.  2006లో కన్నడ సినిమా ఐశ్వర్య అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది.  ఆ తరువాత 2007లో దీపికా బాలీవుడ్ లో షారుక్ తో ఓం శాంతి ఓం సినిమా చేసింది.  


ఈ సినిమా సూపర్ హిట్టైంది.  సినిమా హిట్ కావడంతో.. దీపికా తిరిగి చూసుకోలేదు.  బాలీవుడ్ మొదటి సినిమాలోనే డ్యూయెల్ రోల్ చేసింది.  ఆ తరువాత వరసగా లవ్ ఆజ్ కల్, కాక్ టైల్, ఏ జవానీ హాయ్ దివాని, చెన్నై ఎక్స్ ప్రెస్, రామ్ లీలా, హ్యాపీ న్యూఇయర్, బాజీరావు మస్తానీ, పద్మావతి, పీకు ఇలా ఎన్నో సినిమాలు చేసింది డీపీయే.  1986లో జన్మించిన దీపికా స్పోర్ట్, మోడలింగ్ రంగం నుంచి వచ్చింది కాబట్టి, ఫిట్నెస్ పై శ్రద్ద ఎక్కువగా ఉంటుంది.  


ఇటీవలే తన జిమ్ ట్రైనర్ కరాచీవాలా సహాయంతో జిమ్ లో బ్యాక్ స్ట్రెచింగ్ కు సంబంధించిన వర్కౌట్స్ చేసింది.  స్ట్రెచింగ్ సహాయంతో ఫుల్ గా బ్యాక్ బెండ్ అయ్యి వావ్ అనిపించింది.  దీనికి సంబంధించిన వీడియోను ట్రైనర్ సోషల్ మీడియాలో పోటీ చేసింది.  ఫిట్నెస్ విషయంలో దీపికా పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పింది.  దీపికా యవ్వనంగా ఉండేందుకు వెన్నుపూస బెండింగ్ కావడం ముఖ్యం అని, దీపికా దాన్ని సాధించిందని నిత్యం యవ్వనంగా కనిపిస్తుందని చెప్తోంది కరాచీవాలా.   అయితే, ఒకవేళ అలా వర్కౌట్ చేసే సమయంలో ఏదైనా తేడా జరిగి కాలు జారితే.. వెన్నుపూస ముక్కలు అవుతుంది.  మనం ఎంతటి కాంట్రల్ చేయాలని ప్రదర్శించినా ఇది సాధ్యం కాకపోవచ్చు.  ట్రైనర్ సమక్షంలో ట్రైనింగ్ కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏవీ ఉండవని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: