తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు తమకి వచ్చిన అవకాశాలని పూర్తిగా సద్వినియోగం చేసుకొని హీరోలుగా శిఖరాలని చేరుకుంటే, మరికొందరు మాత్రం వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయితే అలా సక్సెస్ అయిన వారే టాలీవుడ్ లో ప్రస్తుతం పెద్ద స్టార్లుగా సూపర్ స్టార్లు గా కొనసాగుతున్నారు. అయితే ఎంత పెద్ద స్టార్ అయినా కూడా మొదట్లో సక్సెస్ కోసం ఎన్నో కష్టాలు పడాల్సిందే. విజయం అంత త్వరగా ఎవరికీ రాదు.

టాలీవుడ్ సినిమా చరిత్రలో స్వర్గీయ నటుడు ఎన్టీఆర్ గారి తరువాత అంతటి స్థాయి, ఇమేజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో  ఎవరంటే అందరికి ముందుగా గుర్తుకువచ్చే ఏకైక పేరు మెగాస్టార్ చిరంజీవి. ప్రాణం ఖరీదు సినిమాతో టాలీవుడ్ వెండితెరకి పరిచయం అయిన మెగాస్టార్, ఖైదీ సినిమాతో అగ్ర హీరోగా మారిపోయారు. ఆ సినిమా తరువాత మెగాస్టార్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.  

ఇక ఆ తరువాత నందమూరి నటసింహం బాలకృష్ణ తాతమ్మ కల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ , బాలకృష్ణ కెరీర్ లో బిగ్ బ్రేక్ ని ఇచ్చిన సినిమా మంగమ్మ గారి మనవడు. ఇక యువసామ్రాట్ కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఒక మోస్తారు విజయం సాధించినా ,  ఆ తరువాత నాగ్  నటించిన ఆఖరిపోరాటం సినిమా అప్పట్లో పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు. ఆ సినిమా నాగ్ కెరియర్ లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక విజయాన్నే ఇంటిపేరుగా మార్చుకున్న విక్టరీ వెంకటేష్ తోలి సినిమా కలియుగపాండవులు మంచి విజయాన్నే అందుకున్నప్పటికీ వెంకటేష్ కెరియర్ కి మంచి ఊపునిచ్చిన సినిమా మాత్రం బొబ్బిలి రాజానే.  

ఇక ఆ తరువాతి తరం నటులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇవ్వగా ..తొలిప్రేమ సినిమాతో తోలి బ్లాక్ బ్లాస్టర్ ని అందుకొని హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇక కృష్ణ నటవారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ తోలి సినిమా యువరాజుతోనే మంచి హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ మహేష్ కి మురారి సినిమాతో తిరుగులేని ఇమేజ్ వచ్చింది. ఇక రెబల్ స్టార్ నటవారసుడిగా ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనా ప్రభాస్ ..వర్షం సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1 , 2 లతో నేషనల్ హీరోగా ఎదిగాడు. ఒక టాలీవుడ్ హీరో నేషనల్ హీరోగా మారడం అంటే మాములు విషయం కాదు.

ఇక నిన్ను చూడాలని సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన   జూనియర్ ఎన్టీఆర్, తన కెరీర్ లో నాలుగవ సినిమాగా వచ్చిన ఆదితో సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ బన్నీకి పెద్ద బ్రేక్ ని ఇచ్చింది మాత్రం ఆర్యనే .  ఇకపోతే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత మూవీతో హీరోగా రంగప్రవేశం చేసాడు. అయితే ఆయనకు కెరీర్ కు మంచి సక్సెస్ గా బ్రేక్ ని ఇచ్చింది మాత్రం రెండవ సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర. ఆ సినిమా అప్పట్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సంచలనంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: