బాలీవుడ్  మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం "లాల్ సింగ్ చద్దా" అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ సర్ధార్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం 22 కిలోల బరువు తగ్గనున్నాడు.. ఈ సినిమాకు "లిటిల్ సూపర్ స్టార్"  డైరెక్టర్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నాడు. లాల్ సింగ్ చద్దా సినిమా "ఫారెస్ట్ గంప్" అనే హలీవుడ్ సినిమాకి ఆఫీషల్ రిమేక్. ఫారెస్ట్ గంప్ సినిమాకి 6 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. 


అమీర్ ఖాన్ హీరోగా  టీ-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ బయెపిక్ "మొఘల్" సినిమాని  ప్లాన్ చేశాడు. కానీ ఆ సినిమా డైరెక్టర్ సుభాష్ కపూర్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం వల్ల ఆయన సినిమా నుండి తప్పుకున్నారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి సంవత్సరం అవుతుంది. అయితే ఈ సినిమాను మళ్లీ పట్టాలు ఎక్కిస్తున్నట్టు ఆయన తెలిపారు.


ఈ సినిమా ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్  మరియు యంగ్ హీరో వరుణ్ ధావన్ లను సంప్రదించారు కానీ  ఇతర కారణాల వల్ల వారు సినిమాలో నటించడం లేదు.  గుల్షన్ కుమార్ కొడుకు భుషన్ కుమార్  నా దగ్గరికి వచ్చి అందరిని ట్రై చేసాం చివరికి మీ దగ్గరికే వచ్చింది. మా నాన్న గారి పాత్ర మీరు చేయలని రాసి పెట్టి ఉంది అని అన్నారు.


టీ-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ ఒక జ్యాస్ షాప్ లో పని చేసే మామూలు యువకుడి నుండి బాలీవుడ్ లోనే అతి పెద్ద మ్యూజిక్ కంపెనీ ఎలా స్థాపించాడు అనేది చాలా మందికి స్ఫూర్తి కలిగించే కథ అందుకోసం సినిమాలో నటించడానికి  ఒప్పుకున్నాను అని చెప్పారు. అమీర్ ఖాన్ మొఘల్ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన మళ్లీ "మొఘల్" సినిమాలో నటించడానికి ఒప్పుకోవడంతో  అందరు ఆశ్చర్యపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: