టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించి తర్వాత విలన్ గా మారి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత హీరోగా ప్రస్థానం మొదలు పెట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో ఎప్పుడు ఆ పేరు  మారుమోగే విధంగా చేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి.  ఎలాంటి సినీ బ్యాగ్ గ్రౌండ్ లేకున్నా తన కష్టాన్ని నమ్ముకొని సినిమాల్లోకి అడుగు పెట్టాడు. 


పునాధిరాళ్లు సినిమాతో తన పునాధి వేసుకున్న చిరంజీవి ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగారు.  ఇక సినిమాల్లో అప్పటి వరకు ఉన్న మూస పద్దతులకు చరమగీతం పాడారు..డ్యాన్స్, ఫైట్స్ లో కొత్త వరవడి తీసుకు వచ్చాడు.  అప్పట్లో టాలీవుడ్ బ్రూస్ లీ, మైకేల్ జాక్సన్ అనేవారు.  మెగాస్టార్ తెరపై డ్యాన్స్ వేస్తుంటే చిన్నా, పెద్దా తేడా లేకుండా చిందులేసే వారు ఉన్నారు. కొంత కాలం సినీ ప్రపంచానికి దూరంగా ఉంటూ రాజకీయాల్లోకి వెళ్లారు..తిరిగి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు.

అయితే సినీ పరిశ్రమలో ప్రతిరోజూ ఎన్నో సమస్యలు, కష్టాలు చెప్పుకునే వారు ఉంటారు..వారికి పెద్దదిక్కుగా ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు పెద్దరికంగా వ్యవహరించే వారు..ఆయన కాలం చేసిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేదు. ఇప్పుడు ఆ భాద్యత చిరంజీవిపై పడింది..కష్టం వచ్చిందంటే ఎవరికైనా తన వంతు సాయం చేసే మెగాస్టార్ ఇప్పుడు దాసరి బాధ్యలు తీసుకుంటారా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. రెగ్యులర్ గా కొందరు సినీ ప్రముఖులను కలుస్తూ కొత్త టీంలను సపోర్ట్ చేస్తూ వారికి సన్మానాలు వంటివి చెయడం ఇవన్నీ మెగా స్టార్ ని దాసరి స్థానంలో నిలబెడుతున్నాయి.

దాసరి నారాయణ ఉన్న సమయంలో  ఏదైనా చిన్న సినిమా బాగా ఆడిన - పెద్ద సినిమాలు కలెక్షన్స్ రాబట్టినా దాసరి నుండి ఆ టీంకు ప్రత్యేక అభినందనలు అందేవి. ఈ నేపథ్యంలో  'శతమానం భవతి'  - 'మహానటి' యూనిట్లను పిలిచి మరీ సన్మానించిన చిరు ఆ తర్వాత అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇటీవలే సినీ మహోత్సవం కి చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరు 'నిను వీడని నీడను నేనే' సినిమాకు సంబంధించి సందీప్ కిషన్ అండ్ టీమ్ ను అభినందించాడు.  మరి భవిష్యత్ లో దాసరి బాధ్యతలు మెగాస్టార్ సమగ్రంగా నిర్వహిస్తారా లేదా చూడాలి. అయితే ఈ బాధ్యత చిరంజీవి నిండు మనసుతో చేస్తారని టాలీవుడ్ వర్గంలో టాక్ నడుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: