ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోల కుటుంబాల ఆదిపత్యం కొనసాగుతోంది. ఈ రేసులో మెగా నందమూరి కుటుంబ హీరోల స్థాయిలో అక్కినేని హీరోలు రాణించ లేకపోతున్నారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

వాస్తవానికి అక్కినేని కుటుంబానికి చెందిన హీరోల లిస్టులో నాగార్జున నాగచైతన్య అఖిల్ సుమంత్ సుశాంత్ లు ఉన్నా ఒక్క నాగచైతన్యకు మినహా మరెవ్వరికీ గత కొంతకాలంగా ఒక్క హిట్ కూడ రావడం లేదు అన్నది వాస్తవం. గత 35 సంవత్సరాలుగా ఇండస్ట్రీ టాప్ సీనియర్ హీరోగా కొనసాగుతున్న నాగార్జునకు కూడ వరస ఫ్లాప్ లు ఎదురు కావడంతో పాటు అతడి లేటెస్ట్ మూవీ ‘మన్మధుడు 2’ ఫ్లాప్ కావడంతో అక్కినేని హీరోల ఇమేజ్ పై మరింత తగ్గిపోయింది.

ఇక ‘మజిలీ’ సక్సస్ అయినా ఆసక్సస్ లో సగభాగం సమంతకు వెళ్ళిపోవడంతో ఆమూవీ వల్ల చైతన్య ఇమేజ్ పెద్దగా పెరగలేదు. ఇక అఖిల్ నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం ఈ అక్కినేని యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్ తో మూవీని చేస్తున్నా ఆమూవీ గురించి ఇండస్ట్రీ వర్గాలు కూడ అంతగా పట్టించుకోవడంలేదు అని టాక్. నాగార్జున మేనల్లుడుగా ఫిలిం ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ఈమధ్య నటించిన ‘మళ్ళీరావా’ ‘సుబ్రమణ్యపురం’ ‘ఇదం జగత్’ మూవీలకు ప్రశంసలు దక్కినా కలక్షన్స్ రాలేదు. 

అలాగే సుశాంత్ నటించిన ‘చిలసౌ’ కు కూడ మంచి పేరు వచ్చింది కానీ కలక్షన్స్ లేకపోవడంతో అక్కినేని యంగ్ హీరోల సినిమాలకు ఓపెనింగ్ కలక్షన్స్ కూడ రావా అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇదిచాలదు అన్నట్లుగా అక్కినేని మేనకోడలు సుప్రియ ‘గూఢచారి’ తో రీ ఎంట్రీ ఇచ్చి సక్సస్ ఇచ్చినా ఆమె కోసం దర్శకులు సరైన పాత్రలు క్రియేట్ చేయలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో పట్టుపట్టి నాగార్జున ఒక భారీ హిట్ ఇవ్వలేకపోతే రానున్న రోజులలో అక్కినేని హీరోల ఆదిపత్యం ఇండస్ట్రీలో మరింత తగ్గే ఆస్కాం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: