‘సైరా’ విడుదలకు ఇక కేవలం 20 రోజులు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులలో ఈమూవీ ప్రమోషన్ వేగం పెంచారు. కేవలం చిరంజీవి మాత్రమే కాకుండా ఈసినిమాకు పనిచేసిన అనేకమంది సాంకేతిక నిపుణులు కూడ ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాకుండా ఈమూవీకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేస్తున్నారు. 
సైరా’ మూవీ 18వ శతాబ్దానికి సంబంధించిన కథ కావడంతో అప్పటి బ్రిటీష్ వారి కార్యాలయాలు ప్రజల ఇళ్ళు ఎలా ఉండేవి తెలుసుకోవడం కోసం వివిధ లైబ్రరీలు ఆనాటి చరిత్రకు సంబంధించిన పుస్తకాల ద్వారా సమాచరాన్ని సేకరించి ఆతరువాత మాత్రమే ఈమూవీలోని సెట్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సంస్థానంలో 64 గ్రామాలు ఉన్న నేపధ్యంలో ఆ 64 గ్రామాలకు రకరకాలుగా సెట్స్ డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

‘సైరా’ మూవీ కోసం ప్రత్యేకంగా ఒక నౌకాశ్రయం జగన్నాథ కొండ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకమైన డిజైన్స్ తో శ్రద్ధపెట్టి సెట్స్ వేసారు అంటే ఈమూవీ గురించి చిరంజీవి ఎంత శ్రద్ధ తీసుకున్నాడో అర్ధం అవుతుంది. ఈమూవీ కోసం కొన్ని వందల మంది టైలర్లు నెలల తరబడి కష్టపడుతూ 15 వేల జతల దుస్తులను కుట్టడమే కాకుండా ఆనాటి కాలంలో బ్రిటీష్ దొరలు రాణులు ఎలాంటి సిల్క్ మెటీరియల్ వాడేవారో అలాంటి మెటీరియల్ ను ప్రత్యేకంగా ‘సైరా’ కోసం తయారు చేయించినట్లు తెలుస్తోంది.

ఇక ఈమూవీ క్లైమాక్స్ లో భావోద్వేగంతో చిరంజీవి చెప్పిన డైలాగ్స్ కు చప్పట్లతో హోరెత్తి పోవడం ఖాయం అని అంటున్నారు. ఇక ఈమూవీ క్లైమాక్స్ లో ఉయ్యాలవాడ పాత్రను పోషిస్తున్న ఉరి తీసే ముందు ఒక బ్రిటీష్ అధికారి 'నీ ఆఖరి కోరిక కోరుకో’ అన్న డైలాగ్ ఉంటుందని టాక్. దీనితో బ్రిటీష్ అధికారులకు అర్ధం కావాలని ఉయ్యాలవాడ 'ఫ.. ఆఫ్ ఫ్రమ్ మై కంట్రీ' అన్న డైలాగ్ చిరంజీవి నోటి వెంట వస్తుందని అంటున్నారు. మెగాస్టార్ నోటివెంట ఒక చిన్న ఇంగ్లీష్ బూతు మాట వినిపించినప్పుడు మెగా అభిమానులు మాత్రమే కాదు ఈ మూవీని చూసే సాధారణ ప్రేక్షకుల రీ యాక్షన్ ఊహకందని విధంగా ఉంటుందని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: