శ్రీరెడ్డి పేరు వింటే చాలు తెలుసు సినిమా పరిశ్రమ అదిరిపోతోంది.  వామ్మో ఆమేనా అని భయపడుతుంది.  కారణం.. క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె చేసిన పోరాటమే.  సినిమా పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి ఎందరో వాడుకొని వదిలేస్తున్నారని చెప్పి పోరాటం చేసింది.  ఇందులోకి చాలామంది లాగింది.  సినిమా స్టార్స్ చాలామంది ఆమె ఉచ్చులో చిక్కుకున్నారు.  పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు చేసింది.  ఇక దగ్గుబాటి కుటుంబం గురించైతే చెప్పాల్సిన అవసరం లేదు.  


వారిపై వరసగా విమర్శలు చేసింది.  బహుశా వారి కుటుంబాన్ని ఆ రేంజ్ లో విమర్శలు చేసిన వ్యక్తులు మరొకరు ఉండకపోవచ్చు.  ఎంతమంది బెదరించినా ధైర్యంగా నిలబడింది.  పోరాటం చేసింది.  పోరాటంతోనే ముందుకు నడిచి విజయం సాధించింది.  ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తున్నది శ్రీరెడ్డి.  తెలుగులో రెండు మూడు సినిమాలకంటే చేయకపోయినా పాపులారిటీ మాత్రం అమితంగా ఉన్నది.  


ఇదిలా ఉంటె, ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ తో బాగా విసిగిపోయిన శ్రీరెడ్డి మెల్లిగా దాని నుంచి బయటకు వచ్చి గరిటపట్టి వంటలు చేస్తున్నది.  వెజ్, నాన్ వెజ్ వంటలు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నది.  రకరకాల రుచులను పరిచయం చేస్తున్నది.  తనకు ఎన్నో రకాల వంటలు వచ్చు అని చెప్తూ వాటిని పోస్టు చేస్తున్న శ్రీరెడ్డిని చూస్తుంటే.. ఫ్యూచర్ లో తప్పకుండా ఏదైనా రెస్టారెంట్ ను ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టుగాకనిపిస్తోంది . 


ఒకవేళ శ్రీరెడ్డి రెస్టారెంట్ ఓపెన్ చేస్తే.. సెలెబ్రిటీలు తప్పకుండా ఆ రెస్టారెంట్ కు వెళ్లారు అనడంలో సందేహం అవసరం లేదు.  అసలే మనవాళ్ళు కొత్త కొత్త రుచులు ఎక్కడ ఉంటాయా అని ఆలోచిస్తుంటారు.  కొత్త కొత్త రుచులకు అలవాటు పడే వ్యక్తులు తప్పకుండా రుచులను ఆస్వాదిస్తారు అనడంలో సందేహం అవసరం లేదు. మరి శ్రీరెడ్డి మనసులో ఇలాంటి ఆలోచన ఉన్నదా? లేదంటే కేవలం సరదాగా కోసమే ఇలాంటి వంటలు వండుతున్నదా.. లాభం లేకుండా మన స్టార్స్ ఏ పని చేయరు కదా.  ఇందులో ఏదో ఒక మర్మం ఉండే ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: