ఇష్టం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీయ శరన్.. ఆ తరువాత తన అందంతో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. ఇష్టం సినిమాతో అనుకోకుండా ఎంట్రీ ఇచ్చినా కూడా..  నేను తొలిసారిగా అంటూ  ప్రేమ పాఠాలను నేర్పించింది. కుటుంబం కోసం ఏమైనా చేయొచ్చు అంటూ సంతోషం సినిమాలో నటించింది. పలనాడులో బాలయ్యకు  ప్రేమ పాఠాలను నేర్పించింది శ్రేయ. ఇలా ఒకటేంటి సినీ కెరియర్ మొదలైనప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకొనే పని లేకుండా సక్సెస్ ను ఆస్వాదిస్తూ వచ్చింది. చిన్న హీరోలను మొదలుకొని, పెద్ద హీరోలైన బాలయ్య, వెంకీ , నాగార్జున , పవన్, చిరులతో చిందేసిన మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరావుతో కలిసి పని చేసి ఆయన చేత బేష్ అని పించుకుంది. 

ఎటు చూసుకున్నకూడా శ్రీయ సినిమా జీవితంలో ఎక్కువ శాతం సక్సెస్ సినిమాలే ఉన్నాయి. ఈమె కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ చిత్రాలలో కూడా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే మరో పక్క ఐటెం సాంగ్ లలో కూడా మెరిసింది. హాట్ డ్రెస్సులలో డ్యాన్స్ వేసి కుర్రాళ్లకు హీటెక్కించింది. ఇది ఇలా ఉండగా ఆమె ఈరోజు తన 37 వ పుట్టిన రోజు  జరుపుకుంటుంది.. 

హరిద్వార్ లో జన్మించిన శ్రీయ చిన్నప్పటి నుండే నాటాకా రంగానికి  సంబందించిన అన్నింటిపైనా ఫోకస్ చేస్తూ వచ్చింది. చదువును కూడా అక్కడే పూర్తి చేసుకుంది. కాలేజీ రోజుల్లోనే ఆమె తన డ్యాన్స్ మాస్టర్ సహకారంతో ఓ మ్యూజిక్ వీడియోలో డ్యాన్స్ వేసింది. ఆ డ్యాన్స్ బాగా హిట్ అవ్వడంతో, ఇష్టం సినిమాతో సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన కూడా నాగార్జున సరసన సంతోషం సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 


ఇకపోతే ఈమె సినీ కెరియర్ ప్రారంభించి దాదాపుగా 20 ఏళ్ళు పూర్తయింది. అయినా ఎక్కడ తరగని అందంతో సోషల్ మీడియాలో రోజుకో పోస్టులను పెడుతూ దూసుకుపోతుంది. శ్రీయ పర్శనల్ జీవితం గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. 2018, మార్చ్ 12 న విదేశీ బాయ్ ఫ్రెండ్ అయిన ఆండ్రిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉన్న కూడా చిట్టి పొట్టి బట్టలను ధరించి హాట్ ఫొటోస్ షూట్ లతో కుర్రాళ్లకు మతి పోగొడుతుంది. గతంలో చాలా సినిమాలకు అవార్డులను కూడా అందుకుంది.. మళ్ళీ సినిమాల్లోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుందని అందరు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: