ప్రతి ఒక దర్శకుడికి  ఓ ప్రత్యేక మైన స్టయిల్ ఉంటుంది ...వాళ్ళ  వాళ్ళ స్టైల్ లో సినిమాలు తీస్తుంటారు . కాకపోతే అందులో కొంత మంది మన రూటే సెపెరేట్ అన్న విదంగా బిన్నంగా ఆలోచిస్తుంటారు .ఎంత బిన్నంగా అంటే వాళ్ళకి వచ్చిన ఆలోచనలు ఇంకెవ్వరికి రావేమో అనిపించేంతలా .ఇలాంటి భిన్నమైన దర్శకుల్లో మొదటి వరుసలో ఉంటాడు టాలీవుడ్ నటుడు దర్శకుడు రవిబాబు .అబ్బో అయన ఆలోచనలు ఊహకందని విదంగా ఉంటాయి . ఆయన తీసిన సినిమాలు ఒకదానికి మించి ఒకటి బిన్నంగా ఉంటాయి . 


మొదట చారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రవిబాబు ...ఆ తర్వాత అల్లరి సినిమాతో దర్శకుడి అవతారం ఎత్తాడు .తన దగ్గర ఉన్న భిన్నమయిన కథలన్నింటిని సినిమాలుగా మలిచి కొన్ని హిట్లు కొన్ని ఫ్లాపులు తన ఖాతాలో వేసుకున్నాడు రవిబాబు .కాగా అల్లరి , అమరావతి ,అవును 1 , అవును 2 లాంటి భిన్నమయిన చిత్రాల్ని నిర్మించిన రవిబాబు ...తాజాగా ఓ పంది పిల్లతో అదుగో అనే పేరుతో ఓ ప్రయోగాత్మక సినిమా చేసినప్పటికీ ఆ సినిమా ప్రేక్షకాదరణ మాత్రం పొందలేక పోయింది . అయితే ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకి రాబోతున్నాడు రవి బాబు .


 తన దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసాడు .ఈ సినిమా పేరు "ఆవిరి" . పేరే డిఫెరెంట్ గా ఉంది అనుకుంటే ...ఫస్ట్ లుక్ అంతకు మించి అన్న రేంజ్ లో ఉంది . ప్రెషర్ కుక్కర్ లో మనిషి తలను ఉంచి ఉడికిస్తున్నటు ఉంది ఈ ఫస్ట్ లుక్ లో ... కాగా ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .  అయితే ఈ సినిమాకి సంబందించిన ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు 


మరింత సమాచారం తెలుసుకోండి: