యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే హీరోయిన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అతని మ్యాన్లీ లుక్, స్టైల్, ఫిజిక్ ఇలా అన్ని లేడీ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. బాహుబలితో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ సాహోతో ఆ క్రేజ్ డబుల్ అయ్యేలా చేసుకున్నాడు. ఓ సౌత్ హీరో బాలీవుడ్ మార్కెట్ ను శాసించడం అంటే అది మాములు విషయం కాదు. 


అందుకే ప్రభాస్ అంటే స్టార్ హీరోయిన్స్ సైతం తెగ ఇష్టపడతారు. లేటెస్ట్ గా ప్రభాస్ ను మెచ్చే హీరోయిన్స్ జాబితాలో ఆరెక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ కూడా చేరింది. ప్రస్తుతం ఆర్డిఎక్స్ లవ్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాయల్ రాజ్ పుత్ ఆ సినిమా ప్రమోషన్స్ లో తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. 


విజయ్ దేవరకొండ, ప్రభాస్ లో ఎవరు హాట్ అనే ప్రశ్న ఎదురవగా ప్రభాస్ అంటూ ఆన్సర్ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. ప్రభాస్ లో ఎప్పుడు ఒక స్పార్క్ ఉంటుందని.. బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని చెప్పింది పాయల్. ఛాన్స్ వస్తే ప్రభాస్ తో సినిమా చేస్తానని అంటుంది ఆర్డిఎక్స్ బ్యూటీ.


ప్రభాస్ సినిమా రావాలంటే ముందు ఈ హీరోయిన్ ఆర్డిఎక్స్ లవ్ లాంటి సినిమాలు చేయకుండా ఉంటే బెటర్. ఓ పక్క వెంకటేష్ తో వెంకీమామ, రవితేజతో డిస్కో రాజా సినిమాలు చేస్తున్న పాయల్ రాజ్ పుత్ ఆర్.డి.ఎక్స్ లవ్ అంటూ అడల్ట్ కంటెంట్ సినిమా చేయడం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ఆర్.డి.ఎక్స్ లవ్ సినిమా సాంగ్ టీజర్ అంతా బూరులా అనిపించినా రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.
   



మరింత సమాచారం తెలుసుకోండి: