మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా గ్యాంగ్ లీడర్ కు నేడు సెన్సార్ కార్యక్రమాలు జరిగాయి. వెరైటీ సినిమాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కినట్లు సమాచారం. నాని, పెన్సిల్ పార్ధసారథి అనే ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 మూవీ హీరో కార్తికేయ విలన్ గా నటించడం జరిగింది. సీనియర్ నటి లక్ష్మి, శరణ్య మోహన్, ప్రియదర్శి, సత్య, రఘుబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు యువ సంగీత తరంగం అనిరుద్ స్వరాలు సమకూర్చడం జరిగింది. 

ఇకపోతే నేడు సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించడం జరిగింది. ఇక ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు, సినిమా యూనిట్ పై పొగడ్తలు కురిపించినట్లు తెలుస్తోంది. సినిమా మొదటి నుండి ఆఖరు వరకు హీరో నాని పండించిన ఎంటర్టైన్మెంట్ సినిమాకు పెద్ద హైలైట్ అని, ఇక కొత్త నటి అయినప్పటికీ హీరోయిన్ ప్రియాంక తన పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించిందట. తమకు జరిగిన ఒక అన్యాయం విషయమై వృద్ధురాలు నుండి చిన్న పాపవరకు నలుగురు విభిన్న వయస్కుల ఆడవాళ్లు, పెన్సిల్ పార్ధసారథి వద్దకు తమ సమస్య పరిష్కారం కోసం రావడం, దానిని అతడు, తన తెలివితేటలతో పరిష్కరించడం ఈ సినిమా యొక్క ప్రధాన ఇతివృత్తమని సమాచారం. దర్శకుడు విక్రమ్ కుమార్ చాలా వరకు సినిమాను ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా నడిపించినట్లు చెప్తున్నారు. 

అయితే సెకండ్ హాఫ్ మధ్యలో కొంత సినిమా ల్యాగ్ అనిపించినప్పటికీ, ప్రీ క్లైమాక్స్ సమయానికి సినిమా మంచి ఊపందుకుంటుందట. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, ఇంటర్వెల్ సీన్, అలానే సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఛేజింగ్ సీన్ మరియు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లు సినిమాలో ప్రధాన హైలైట్స్ గా నిలవనున్నాయట. ఇక అనిరుద్ అందించిన సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కూబా అందించిన ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధానాకర్షణ గా నిలిచాయట. మొత్తంగా సెన్సార్ సభ్యులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే, గ్యాంగ్ లీడర్ కు చాలావరకు సక్సెస్ టాక్ వచ్చినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న గ్యాంగ్ లీడర్ ఎంతమేర సక్సెస్ సాధిస్తాడో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: