బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టి వెండి తెరపై ఎన్నోఅద్భతాలు సృష్టిస్తున్న దర్శక ధీరుడు రాజమౌళి.  స్టూడెంట్ నెం.1 మూవీ తో దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి బాహుబలి2 వరకు ఒక్క ఫెయిల్యూర్ ని కూడా చూడలేదు.  అందుకే ఆయనను టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకధీరుడు అంటారు.  ఇక రాజమౌళి మూవీలో ఒక్క చిన్న పాత్ర దొరికినా ఆ పాత్రకు ఎంతో గౌరవం ఉంటుందని భావిస్తుంటారు.  రాజమౌళి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, సమంత జంటగా నటించిన ‘ఈగ’ సినిమా ఒక వ్యూజువల్ వండర్ సృష్టించిన విషయం తెలిసిందే. 

ఈ మూవీలో కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించినా హీరో రేంజ్ క్రేజ్ సంపాదించాడు.  తాజాగా  ఎస్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గురువారం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియన్ ఫిలిం గా తెరకెక్కుతున్న పహిల్వాన్ పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. పహిల్వాన్ మూవీ పాన్ ఇండియన్ మూవీగా  విడుదలవుతోంది అంటే అందుకు కారణం రాజమౌళి అని తెలిపాడు. రాజమౌళి ఈగ, బాహుబలి చిత్రాన్ని నన్ను నార్త్ ప్రేక్షకులకు కూడా చేరువ చేశాయి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో కిచ్చా సుదీప్ మాట్లాడుతూ..తనను తెలుగు ప్రేక్షకులు ఇంతగా అభిమానిస్తున్నారంటే ఆ క్రెడిబులిటీ కేవలం దర్శకులు రాజమౌళిదే అని అన్నారు. 


కన్నడలో నాకు ఎంత మంచి పేరు ఉన్నా ‘ఈగ’,‘బాహుబలి’లాంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో నటించడం నా అదృష్టంగా భావిస్తానని అన్నారు.  రాజమౌళి లాంటి దర్శకులు జాతీయ స్థాయిలో మూవీలు రూపొందించాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. ఒక దశలో బాలీవుడ్ లో సౌత్ ఇండియన్ సినిమాలు విడుదలవుతున్నాయంటే ఆ క్రెడిట్ రాజమౌళిదే అని సుదీప్ అభిప్రాయ పడ్డాడు. పహిల్వాన్ మూవీలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: