అందం అంటే పూర్తి నిర్వచనం ఆరడుగుల చీర, అర్ధరూపాయంత బొట్టు. కనిపించి కనిపించని అందాలు.. అంతే కాదు కొంటె చూపులతో కుర్రాళ్ళ మనసుకు గాలం వేయడం.. చిరునవ్వుతో మతోపోయేలా చేసేవారు అలనాటి ముద్దుగుమ్మలు. ప్రస్తుతం హీరోయిన్లు మాత్రం మొత్తం చూపించాలి. అదే అందం అంటున్నారు. అదే ఫార్ములా ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు కూడా. 

వివరాల్లోకి వెళితే.. తెలుగులో ఎంట్రీ ఇచ్చే ఏ ఇతర భాష హీరోయిన్లు అయిన కూడా తెలుగులో నటించిన మొదట సీనియాలో ఎంతో పద్దతిగా, అనుకువగా కనిపించి అందరి దృష్టిని అమాంతం లాగేసుకుంటారు. ఆ సినిమా కనుక హిట్ అయితే మాత్రం తరువాత చిత్రానికి ఆమె, ఈమేనా అనేంతలా మారి మరి కనిపిస్తారు. పద్దతిని కాస్త అటక మీదకెక్కిస్తారు. 

అసలు విషయానికొస్తే.. రక్త చరిత్ర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రాధికా ఆప్టే.. అందరికి తెలిసిన సెలెబ్రటీ. ఆ తరువాత బాలయ్య సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ ఆ సినిమాలో పద్దతిగా కనిపించింది. ఆ తర్వాత కనిపించిన తెలుగు సినిమాలలో పద్దతిగానే ఉంది. కానీ, బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అందాలను విచ్చల విడిగా ఆరబోస్తూ వస్తుంది. అంతే రేంజులో కామెంట్లను కూడా అందుకుంటుంది. 

సినిమాలలో అంటే ఫ్యాన్స్ కోసం ఆరబోసింది అనుకోవచ్చు.. బయట ఎక్కడికెళ్లినా కూడా ఈ అమ్మడు అందాలని అరువిచ్చేలా చిన్ని బట్టలతో, కొరికే కొర్ర చూపులతో దర్శమినిస్తూ ఫోటోలని క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ చేస్తూ వస్తుంది. ఆ ఫోటోలకు లైకులు, కామెంట్లు విపరీతంగా వచ్చి పడుతున్నాయి. ఆ విదంగా ఏ మాత్రం జోరును తగ్గించకుండా దూసుకుపోతుంది. తాజాగా ఓ హిందీ చిత్రంలో నగ్నంగా నటించి అందరిని షాక్ గురిచేసింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: