టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరనే చెప్పాలి. అప్పటివరకు ఒక విధంగా సాగుతున్న తెలుగు సినిమా పరిస్థితులను అమాంతం మార్చేసిన ఆ సినిమా కలెక్షన్ల ప్రభంజనం, మన తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ డూపర్ హిట్ గబ్బర్ సింగ్ సినిమా కూడా అంతకముందు ఏకంగా పదేళ్లవరకు సరైన మాస్ హిట్ లేని పవన్ కు మరియు ఆయన ఫ్యాన్స్ కు విపరీతమైన జోష్ ని ఇచ్చింది. అయితే ఈ రెండు సినిమాలతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు పరోక్షంగా సంబంధం ఉంది. 

నిజానికి కొన్నేళ్ల క్రితం కెరీర్ పరంగా కొంత సతమతం అవుతున్న సల్మాన్ కు, సూపర్ స్టార్ మహేష్ నటించిన పోకిరి సినిమా రీమేక్ గా రూపొంది రిలీజ్ అయిన వాంటెడ్ సినిమా సూపర్ హిట్ సాధించి, ఆయనకు మంచి బ్రేక్ ని అందించింది. ఇక బాలీవుడ్ లో ఆయన హీరోగా తెరకెక్కిన దబాంగ్ సినిమానే మన టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సూపర్ డూపర్ హిట్ సాధించడం జరిగింది. ఇక మహేష్ పోకిరి సక్సెస్ తరువాత ఆ సినిమాకు సీక్వెల్ వస్తుందని అందరూ భావించారు , అయితే అది ఇప్పటికేవరకు కుదరనే లేదు. అయితే సల్మాన్ మాత్రం మరికొద్దిరోజుల్లో వాంటెడ్ 2 పేరుతో ఆ సినిమాకు సీక్వెల్ ని సిద్ధం చేసి నటించబోతున్నట్లు సమాచారం. 

ఇక మరోవైపు కొన్నేళ్ల క్రితం దబాంగ్ 2 లో కూడా నటించిన సల్మాన్, ప్రస్తుతం దబాంగ్ 3 లో నటిస్తూ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మంచి మాస్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న వాంటెడ్ 2 కి కూడా ప్రభుదేవానే దర్శకత్వం వహించబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విధంగా ఓవైపు మహేష్, మరోవైపు పవన్ సినిమాల సీక్వెల్స్ లో నటిస్తూ సల్మాన్ దూసుకుపోతున్నాడు. మరి రేపు రిలీజ్ తరువాత ఆయా సినిమాలు ఏ మేర విజయాన్ని అందుకుని ఆయనకు ఎంతటి పేరు తీసుకువస్తాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: