రామ్ చరణ్ ఒత్తిడితో రాజమౌళి ‘సైరా’ సినిమాను వచ్చే వారం చూడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘సాహో’ విషయంలో ఆఖరి నిముషంలో ఎంటర్ అయిన రాజమౌళి ఆ మూవీ రన్ టైమ్ అదేవిధంగా అనవసరపు సీన్స్ విషయంలో సలహాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ‘సైరా’ విషయంలో రిపీట్ కాబోతోంది.

అయితే ‘సైరా’ ను చూడబోతున్న రాజమౌళి కేవలం యధాలాపంగా ఆ సినిమాను చూసి సరిపెడతాడా లేదంటే కొన్ని కీలక సూచనలు చేస్తాడా అన్న విషయమై ఆ సక్తికర చర్చలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఈ ఆఖరి నిముషంలో రాజమౌళి ‘సైరా’ విషయంలో చెప్పే సూచనలు ఎంతవరకు చిరంజీవి చరణ్ లు అనుసరించ గలరు అన్న సందేహాలు కలుగుతున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి కేవలం ‘సైరా’ రన్ టైమ్ విషయంలోనే తన అభిప్రాయం చెప్పే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే పూర్తి ఎడిటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2 గంటల 55 నిముషాలు వచ్చిన నేపధ్యంలో ఈ మూవీ నిడివిని ఎక్కడ కట్ చేస్తే మరో 15 నిముషాలు తగ్గి ఈ మూవీ నిడివి 2 గంటల 40 నిముషాలకు కుదింపవచ్చు  అన్న కోణంలో రాజమౌళి సూచనలు ఉండబోతున్నట్లు టాక్. 

అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది అని అంటున్నారు. సినిమాల ఎడిటింగ్ విషయంలో ఒకసారి ఫైనల్ నిర్ణయం చిరంజీవి తీసుకున్న తరువాత ఆఖరికి అల్లు అరవింద్ చెప్పినా వినడు అన్న మాటలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో చిరంజీవి స్వభావం పూర్తిగా రాజమౌళికి తెలుసు కాబట్టి కేవలం ‘సైరా’ విషయంలో పైపై సూచనలు ఇచ్చి సరిపెడతాడు కాని ‘సైరా’ మేకింగ్ గురించి అందులోని లోపాల గురించి అంతలోతుగా రాజమౌళి వెళ్ళడు అన్న మాటలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: