పవన్ కళ్యాణ్ ‘తొలి ప్రేమ’ సినిమాతో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చిన దిల్ రాజ్ కు పవన్ కళ్యాణ్ తో సినిమాచేయాలి అన్నది జీవిత ధ్యేయం. ఇలాంటి పరిస్థితులలో దిల్ రాజ్ ఇప్పటికే తాను రీమేక్ చేస్తున్న 'పింక్‌' రీమేక్‌ లో పవన్ నటింప చేయడానికి ఒక భారీ స్కెచ్ వేసినట్లు సమాచారం. 

ఈమూవీని అతి తక్కువ రోజుల వర్క్‌తో అసలు షర్ట్‌ నలగకుండా ఎండ తగలకుండా మల్లె పూవులా పవన్ ని చూసుకుంటూ ఈమూవీని పూర్తి చేసి లాభాలలో యాభై శాతం వాటా ఇస్తాను అంటూ దిల్‌ రాజు పవన్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు వస్తున్నాయి. బాలీవుడ్ లో విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసకుల పొందిన పీకే రీమేక్ కు భారీ బడ్జెట్ అవసరం లేదు.  

ఈమూవీకి భారీ సెట్స్ ఫారిన్ లొకేషన్స్ ఏవి అవసరం లేదు కాబట్టి ఈమూవీని చాలా సులువుగా 40 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేసి ఆ మూవీని 12౦ కోట్ల స్థాయిలో మార్కెట్ చేసి పవన్ కు ఈ మూవీ లాభాలలో భాగంగా 40 కోట్లు ముట్ట చెపుతానని దిల్ రాజ్ భారీ ప్రణాళికతో పవన్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు పవన్‌ కళ్యాణ్‌  ఈ మూవీ ప్రాజెక్ట్ లో మొదట్లో చేయనని గట్టిగా ఉన్నా కానీ తర్వాత కాస్త మెత్తబడి ఆలోచిద్దామని చెప్పాడని  ఇప్పుడు లీకులు వస్తున్నాయి. అయితే ఇప్పటికే  పవన్‌ కళ్యాణ్‌  ఏ.ఎం. రత్నం మైత్రి మూవీ మేకర్స్‌ దగ్గర అడ్వాన్స్ లు తీసుకువున్న పరిస్థితులలో వారిని కాదని ఇప్పుడు దిల్ రాజ్ వైపు టర్న్ తీసుకుంటే వారి నుంచి స్పందన ఎలా ఉంటుంది అన్న అంతర్మధనంలో పవన్ ఉన్నట్లు టాక్. అంతేకాదు ఇలా ఇప్పుడు సినిమాలు చేయడం మొదలుపెడితే  ఇప్పటికే పార్ట్ టైం పొలిటీషియన్ అని తన పై ఉన్న ముద్ర శాస్వితం అయిపోతుందా అన్న సందేహాలు కూడ పవన్ ను వెంటాడుతున్నాయి అని తెలుస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: