సాధారణంగా పండుగల సందర్భంగా ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అని అంటుంటారు...దాంతో చాలా మంది ఆ ఆఫర్ కి ఆకర్షితులవుతుంటారు.  ఇదే ఆఫర్ సినిమా టిక్కెట్లకు అయితే..అందులోనూ స్టార్ హీరోల సినిమాలకు అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అవును ఇది నిజం, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని తెలుగు, మళియాళ,కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. 

ఈ మూవీ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ పై సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తున్న విషయం తెలిసిందే.  ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తున్నారు.  మరో ముఖ్యపాత్రలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు.  మరో ముఖ్యపాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ఇలా భారీ తారాగణంతో నిర్మితమైన ‘సైరా’ పై భారీ అంచనాలే నెలకొన్నాయి.  తాజాగా ఈ మూవీ ఓ బంపర్ ఆఫర్ పట్టుకొచ్చింది.

కాకపోతే ఈ ఆఫర్ మాత్రం మన దేశంలో కాదండోయ్.. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ను ఉచితంగా ఇవ్వాలని యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు. అది కూడా సినిమా రిలీజ్ రోజునే.అమెరికాలో ఏటీ అండ్ టీ సంస్థ 'సైరా' టికెట్లను ఆన్ లైన్లో విక్రయిస్తోంది. అక్టోబర్ 1నే అమెరికాలో ఈ సినిమా విడుదల కానుంది. ఆ రోజు సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయి. సాధారణంగా మంగళవారం అంటే అక్కడ ఉద్యోగాలకు వెళ్లే వారే ఎక్కువగా ఉంటారు..దాంతో ఆ ఎఫెక్ట్ పడొచ్చని భావించిన డిస్ట్రీబ్యూటర్లు ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే 'సైరా'కు కూడా ఆఫర్ వచ్చింది. ఇక ఈ ఆఫర్ ను ఎంతమంది వినియోగించుకుంటారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: