ఒకప్పుడు రేప్ సీన్స్ వచ్చాయి అంటే కొన్ని సినిమాలలో సత్యనారాయణ మరికొన్ని సినిమాలలో చలపతిరావులతో మాత్రమే తీసేవారు. ఇలాంటి సీన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ లుగా వారికి ముద్రపడి పోవడంతో పాత సినిమాలలో ఎక్కడ చూసినా వీరు చేసే రేప్ సీన్స్ మాత్రమే కనిపిస్తాయి. 

గతకొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చలపతిరావు మారినా ప్రస్తుతం చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు రంగంలోకి దిగడంతో చలపతిరావుకు అవకాశాలు ఇచ్చేవారు కరువైపోయారు. సినిమాలలో విలన్ పాత్రలను చేసే చలపతిరావు చాల మృధుస్వభావి. తన కొడుకు రవి బాబును ఎంతో ముద్దుగా పెంచడమే కాకుండా అతడు నటుడుగా దర్శకుడుగా రాణించడంలో చలపతిరావు ప్రోత్సాహం ఉంది. 

ఆ మధ్యన ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో చలపతిరావు మాట్లాడుతూ చేసిన కొన్ని వివాదాస్పద కామెంట్స్ కు విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ రావడమే కాకుండా మహిళా సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీనితో చలపతిరావు ఓపెన్ గా క్షమార్పణలు చెప్పడంతో ఆవివాదం సద్దుమణిగింది. ఇలాంటి నేపధ్యంలో అలీ ఒక ప్రముఖ ఛానల్ లో నిర్వహించే టాక్ షోకు అతిధిగా రాబోతున్నాడు. ఈ కార్యక్రమానికి  సంబంధించిన ఒక ప్రోమోను ఆ ఛానల్ ప్రసారం చేస్తోంది. 

తాను అనాలోచితంగా అన్న మాటలకు కొన్ని వందల సార్లు క్షమార్పణ చెప్పినా తాను ఎదో నేరం చేసిన వ్యక్తిగా ముద్ర వేసారని చలపతిరావు ఆవేదనకు గురి అయ్యాడు. అంతేకాదు తన పై అప్పట్లో అనేక మహిళా సంఘాలు చేసిన మాటల దాడిని తట్టుకోలేక ఒక క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించి తనను టార్గెట్ చేసిన మహిళా సంఘాల పేర్లు వ్రాసి చచ్చిపోవాలని అప్పట్లో తనకు వచ్చిన ఆలోచనలను షేర్ చేసాడు. అయితే తన కొడుకు రవి బాబు తన ఆలోచనలు గ్రహించి తనకు ఇచ్చిన కౌన్సిలింగ్ తో తాను బ్రతికి బయటపడ్డ విషయాలను ఆ టాక్ షోలో వివరించాడు..   



మరింత సమాచారం తెలుసుకోండి: