టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సైరా నరసింహారెడ్డి. అంతేకాకుండా చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ గా ‘సైరా’ సినిమా తెరకెక్కింది. ముఖ్యంగా స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఇటువంటి సినిమాలను ఎప్పటినుండో చెయ్యాలని తన డ్రీమ్ అని చిరంజీవి చెబుతూ తన కొడుకు నిర్మాణంలో నేను ఈ సినిమా చేయటం చాలా గర్వకారణంగా ఉందని రామ్ చరణ్ నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని ఇటీవల సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పటం జరిగింది.


అయితే ఇటీవల సినిమాకి సంబంధించిన ప్రోమోలు విడుదల చేసిన క్రమంలో సినిమాకి భారీగా ఖర్చు పెట్టినట్టు అర్థం అవుతుంది. ఇదే విషయాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి మరియు ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన లెజెండరీ టెక్నీషియన్ రాజీవన్ కూడా ఇదే తెలిపాడు. అంతేకాకుండా రాజీవన్ ఇంకా మాట్లాడుతూ ఈ సినిమాకి కష్టపడిన అంతగా తన కెరీర్లో మరో సినిమాకి కనబడలేదని అంత హై బడ్జెట్ సినిమా సైరా అని అంటున్నాడు. ఇంకా మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 64 గ్రామాలకు రాజు అని.. ఆ గ్రామాలన్నీ తెరపై కనిపిస్తాయని రాజీవన్ తెలిపాడు. వీటిలో కొన్ని గ్రామాల్ని సెట్టింగ్స్ ద్వారా తీర్చిదిద్ది.. షూటింగ్ చేశామని.. మిగతా గ్రామాల్ని మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా సృష్టించామని తెలిపాడు రాజీవన్.


ఈ చిత్రం కోసం ఏకంగా 42 సెట్టింగ్స్ వేసినట్లుగా రాజీవన్ వెల్లడించాడు. వీటిలో దాదాపు 15 సీట్లు చాలా పెద్దవని వాటిని తెరపై చూపించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది వాటిని చూడటానికి రెండు కళ్ళూ చాలవు అని రాజీవన్ తెలిపాడు. ముఖ్యంగా నౌకాశ్రయం జగన్నాథ కొండ సెట్టింగ్స్ చుట్టూనే సైరా సినిమా మొత్తం జరుగుతుందని రాజీవన్ పేర్కొన్నాడు. ముఖ్యంగా అప్పటిలో మనుషులు వేసుకున్న వస్త్రధారణ చూపించడానికి దాదాపు 22 మంది కాస్టింగ్ టైలర్లు ఐదు నెలల పాటు 15వేల దుస్తులు తయారు చేశారని రాజీవన్ పేర్కొన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: