ఈ మద్య కొంత మంది సెలబ్రెటీల పేరు చెప్పి అమాయకులను దోచుకుంటున్నారు. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రెటీల పేర్లు చెప్పి డబ్బు దోచుకున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. అయితే తాము ఇచ్చింది ఫేక్ మనుషులకని, ఫేక్ అకౌంట్స్ అని బాధితులు లబో దిబో అంటున్నారు. తాజాగా దర్శకుడు, నటుడు రాఘవ లారెస్స్ ట్రస్ట్ పేరు చెప్పి ఓ వ్యక్తి ఏకంగా రూ.18 లక్షలు నొక్కేసిన ఘటన వెలుగు లోకి వచ్చింది. రాఘవ లారెస్స్ హీరోగా ఎంత క్రేజ్ సంపాదించాడు..సేవా కార్యక్రమాల ద్వారా కూడా అందే మంచి పేరు తెచ్చుకున్నాడు. 

ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.  ఎక్కడైనా ప్రకృతి విలయతాండవం చేసినపుడు కష్టాల్లో ఉన్న బాధితులను ఆదుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల కేరళాలలో ఓ వృద్ద మహిళలకు ఇళ్లు కట్టించి ఇచ్చిన విషయం తెలిసిందే. అలాంటి లారెన్స్ పేరు చెప్పుకొని ఓ వ్యక్తి మోసం చేసిన సంఘట అందరిని షాక్ కి గురి చేసింది. తన కుమార్తె మెడిసిన్ సీటు కోసం ప్రయత్నిస్తున్న ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి, రాఘవ లారెన్స్ ట్రస్ట్ పేరు చెప్పగానే నమ్మేసి రూ. 18 లక్షలు సమర్పించుకున్నాడు.

వివరాల్లోకి వెళితే... తమిళనాడు, రామనాథపురం, చిన్నకడై ప్రాంతంలో ఉండే అల్‌ అమీన్, పత్తూన్‌ నిషాల‌ కుమార్తె, 'నీట్‌' రాయగా, తక్కువ మార్కులు వచ్చాయి. ఒకరోజు ప్రవీణ్ కుమార్ కి అల్ అమీన్ కలిశాడు...ఆ సమయంలో తాను నటుడు రాఘవ లారెన్స్‌ నిర్వహిస్తున్న ట్రస్ట్‌ కు ఉపాధ్యక్షుడినని చెప్పుకున్నాడు. ట్ర‌స్ట్ ద్వారా వూలూర్‌ లోని వైద్య కళాశాలలో అతి తక్కువ ధరకే సీటు వస్తుందని, అయితే కొంత ఖర్చవుతుందని చెప్పాడు. అతని మాటలు నమ్మి అల్‌ అమీన్ తొలుత రూ. 4.5 లక్షలు, ఆపై, మరికొంత  ఇలా అడిగినప్పుడల్లా డబ్బిచ్చి, మొత్తం రూ. 18 లక్షలు సమర్పించుకున్నారు. 

ఎప్పటికీ  ప్రవీణ్ నుంచి సీటు విషయమై సరైన సమాచారం రాకపోవడం, ఆపై కనీసం మాట్లాడకపోవడంతో, తాము మోసపోయామని గ్రహించి, రామనాథపురం జిల్లా ఎస్పీ ఓం ప్రకాశ్‌ మీనాక్షిని కలిసి ఫిర్యాదు చేశారు. కేసు ఫైల్ చేసుకొని నింధితుని వేటలో ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రవీణ్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: