పెళ్ళి చూపులు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా ఎదిగారు. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమా విజయ్ కెరీర్లో ఇంకో మలుపి. ఆ తర్వాత విజయ్ కి స్టార్ హీరో రేంజ్ వచ్చేసింది. అయితే సోషల్ మీడియాలో తన సినిమా విశేషాలు పంచుకునే విజయ్ తాజాగా ఒక చర్యపై స్పందించాడు.


తెలుగు రాష్ట్రల్లో ఉన్న నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలని చేపట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పట్ల పర్యావరణ ప్రేమికులు గుర్రుగా ఉన్నారు. యురేనియం తవ్వకాల వల్ల అడవుల్లోని జీవ జాతుల మనుగడ దెబ్బతింటుందని, దానివల్ల మానవాళికి ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ ఈ విషయం మీద గట్టిగానే తన వాదనని వినిపిస్తుంది.


మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాన్ కూడా నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపడం సరికాదంటూ, కేంద్రప్రభుత్వం ఆ చర్యని మానుకోవాలంటూ చెప్పాడు. తాజాగా విజయ్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, ఇరవై వేల ఎకరాల్లో ఉన్న నల్లమలని యురేనియం కోసం నాశనం చేయడం సరికాదని, దానివల్ల అడవుల్లోని సరస్సులు కలుషితం అవుతాయని, ఆ నీటిని జంతు జాలాలు తాగడం వల్ల వాటి ప్రాణానికి తీవ్ర నష్టం అన్నాడు.


ఇంకా ఇప్పటికే మన పీల్చే గాలి, త్రాగేనీరు కలుషితం అయింది. అడవుల్లోని కొద్ది భాగాన్నైనా కాపాడుకుందాం అని అన్నాడు.  యురేనియంని కొనుక్కోవచ్చు. కానీ అడవులని కొనుక్కోలేం కాదా! ఒకవేళ కొనుక్కునే స్తోమత లేకపోతే ఎలక్ట్రిసిటీ కోసం సౌరశక్తిని అభివుద్ధి చేయండి అంటూ సలహా ఇచ్చాడు.







మరింత సమాచారం తెలుసుకోండి: