మెగాస్టార్ హీరోగా నటించిన సైరా మూవీ అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది. భారీ సినిమాగా వచ్చిన సాహో సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో సైరా అప్రమత్తం అయ్యింది. సైరా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా బయటకు వచ్చిన తరువాత ఎన్ని అనుకున్నా ఉపయోగం ఉండదు కాబట్టి సినిమా రిలీజ్ లోపే ఏదైనా చేయాలి. అందుకే అదనపు జాగ్రత్తలు తీసుకోవడానికి యూనిట్ రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ దర్శకుడు జక్కన్నకు సినిమా చూపించాలని అనుకుంటున్నారు.
రాజమౌళి సినిమాను చూపించి ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటె సరిచేయడానికి సదా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ బిజీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు మూడు రోజుల్లో రాజమౌళి సైరా సినిమాను చూసే అవకాశం ఉన్నది. సినిమా చూసిన తరువాత ఫైనల్ గా ఒకే చేస్తే ఫైనల్ కట్ తో సినిమాను లాక్ చేసి సెన్సార్ కు పంపుతారట. సో, సినిమాను ఫైనల్ చేయాల్సిన బాధ్యత జక్కన చేతిలో పెట్టారు మెగాస్టార్.
చరణ్ కు జక్కన్నతో మంచి అనుబంధం ఉన్నది. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ కూడా నటిస్తున్నారు కాబట్టి జక్కన సినిమా చూసేందుకు సిద్ధంగా ఉన్నాడని అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాత. సో, తప్పకుండా జక్కన సినిమా చూసి తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉన్నది. ఇప్పటికే రిలీజైన టీజర్ అందరిని ఆకట్టుకుంది. ఈనెల 18 వ తేదీన కర్నూలులో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ లోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
ఈ ఈవెంట్ తరువాత సినిమా ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 2 వ తేదీకి సమయం చాలా తక్కువగా ఉండటంతో వీలైనంతగా సినిమాను ప్రమోట్ చేయడానికి యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో పదికి పైగా యాక్షన్ సీన్స్ ఉన్నాయట. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మరి ఆ రెండు హైలైట్ సీన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే మాత్రం అక్టోబర్ 2 వ తేదీ వరకు ఆగాల్సిందే.