టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు వద్దు అంటూ గళం విప్పారు. చాలా మంది ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు శేఖర్ కమ్ముల మరియు ఇతర చాలా మంది డైరెక్టర్లు సేవ్ నల్లమల అంటూ సోషల్ మీడియాలో వ్యతిరేకంగా కామెంట్ చేసిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై ఇటీవల స్పందించారు. ప్రకృతిని అడవులను ఆ విధంగా పాడు చేయడం మంచిది కాదని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు చేయకూడదని పొలిటికల్ లీడర్ విహెచ్ తో మీడియా సమావేశంలో కూర్చొని మాట్లాడారు.


ఇప్పుడు ఇదే విధంగా పవన్ కళ్యాణ్ తర్వాత అదే స్థాయిలో రౌడీ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో స్పందించారు. నల్లమలలో హీరోయిన్ తవ్వకాలు విషయం పై సెటైర్లు వేశారు. '20 వేలఎకరాల నల్లమల నాశనం కాబోతోంది. ఇప్పటికే చెరువుల్ని నాశనం చేసుకున్నాం. వరదలకు కారణం అయ్యాం. కరువుకు కూడా మనమే కారణం. చాలా వరకు తాగునీరు కలుషితంగా మారింది. గాలి కూడా కలుషితంగా మారింది.


అయినా కూడా మనం నాశనం అనే పదానికి న్యాయం చేస్తూనే ఉన్నాం. ఏదైనా మంచిది అని కనిపిస్తే అది నాశనం అవుతోంది. ఇప్పుడు నల్లమల పై కన్ను పడింది. యురేనియం అంతగా అవసరం అయితే కొనుక్కోవచ్చు. కానీ అడవులని కొనగలమా ? యురేనియంకి బదులు సోలార్ ఎనర్జీని ఉపయోగించండి. ప్రతి ఒక్కరు ఇళ్లలో సోలార్ ప్యానల్స్ ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయండి. అంతే కానీ.. మనకు అత్యంత అవసరమైన పర్యావరణం, గాలి, నీటిని నాశనం చేసుకుంటూ యురేనియంతో ఏం పీకుతాం' అంటూ విజయ్ దేవరకొండ సీరియస్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.    



మరింత సమాచారం తెలుసుకోండి: