తెలుగు, తమిళ భాషల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది యంగ్ లేడీ కమెడియన్ విద్యుల్లేఖ. హీరోయిన్ స్నేహితురాలిగా ఎన్నో సినిమాల్లో టాప్ హీరోయిన్స్ తో నటించింది విద్యుల్లేఖ. సోలోగా కూడా ఎన్నో సినిమాల్లో టాప్ కమెడియన్లతో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే విద్యుల్లేఖ లావుగా పొట్టిగా ఉండటం ఆమె కామేడీ టైమింగ్ కి బాగా కలసి వొచ్చింది. గతంలో విద్యుల్లేఖపై అనేక విమర్శలు వినిపించాయి. కేవలం తెలుగు చిత్రాలకే ఆమె ప్రాధాన్యత ఇస్తోందని తమిళ చిత్రపరిశ్రమలో కొందరు విద్యుల్లేఖని విమర్శించారు.
గతంలో ఆమె తమిళ మూవీస్ లో ఎక్కువగా కనిపించేది..కానీ తెలుగు లో ఎక్కువగా ఛాన్సులు రావడంతో ఆమె ఇక్కడే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అయితే విద్యుల్లేఖ లావుగా ఉండటంతో ఈ మద్య కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం..దాంతో ఆమె కొంత కాలంగా తన ఫిజిక్ పై ఎక్కువ ఫోకస్ చేయడం మొదలు పెట్టిందట. ఈ నేపథ్యంలోనే తన బరువు చాలా వరకు తగ్గించుకున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల విద్యుల్లేఖ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు అందరికి షాకిచ్చేలా ఉన్నాయి. నటనతో పాటు ఆమె బొద్దుగా ఉండడం కూడా కమెడియన్ గా అవకాశాలు వచ్చేలా చేసింది. మరి విద్యుల్లేఖ బాగా స్లిమ్ గా మారి హీరోయిన్ ఛాన్సుల కోసం ఏమైనా ట్రై చేస్తుందా అని టాలీవుడ్ లో గుస గుసలాడుతున్నారు.
ఈ అమ్మడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావిస్తోందా... తన లుక్ పై దృష్టి పెట్టి జిమ్ లో కష్టపడింది. ఆశ్చర్యకరంగా బరువు తగ్గి నాజూకైన లుక్ మారిపోయింది. అయితే విద్యుల్లేఖ బరువు తగ్గి స్లిమ్ గా మారడానికి ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా? ఈ మద్య కమెడియన్లు హీరోలుగా మారుతున్న విషయం తెలిసిందే. ఇటీవీల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు తమిళం కంటే తెలుగులోనే మంచి అవకాశాలు వస్తున్నాయని అందుకే టాలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పింది. ఇచ్చింది. ప్రస్తుతం విద్యుల్లేఖ వెంకిమామ చిత్రంలో నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: