బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు మొదట్లో కాస్త మందకొడిగా సాగినా కంటెస్టంట్స్ కోపతాపాలు.. టాస్కుల్లో గొడవలు ఈ సీజన్ ను రక్తికట్టించేలా చేశాయి. 7వ వారం అలి రెజా ఎలిమినేట్ అవడమే పెద్ద షాక్ అనుకున్నారు. అయితే 8వ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు. ఇంతకీ నామినేషన్స్ లో ఉన్నది ఎవరని చూస్తే శ్రీముఖి, హిమజ, మహేష్, పునర్నవి, శిల్పా చక్రవర్తి అని తెలుస్తుంది.


రవి కృష్ణ కూడా నామినేట్ అవగా కెప్టెన్ అయిన బాబా భాస్కర్ ఒకరిని సేఫ్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించగా మహేష్, శ్రీముఖిలలో ఒకరిని సేఫ్ చేస్తాడని అనుకున్న బాబా భాస్కర్ సర్ ప్రైజింగ్ గా రవి కృష్ణ పేరు చెప్పాడు. ఇక ఆ తర్వాత జరిగిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ లో పునర్నవి, శ్రీముఖి, మహేష్ ల పర్ఫార్మెన్స్ వరస్ట్ అని బిగ్ బాస్ డిసైడ్ చేశాడు.


అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ ను కూడా పునర్నవి లెక్క చేయలేదు. ఇదిలాఉంటే ఈ వారం నాఇమేషన్స్ లో ఉన్న పునర్నవి తన ప్రవర్తనతో షాక్ ఇస్తుంది. ఈ అమ్మాయికి ఇంత మొండితనం ఏంటని అందరు అనుకుంటున్నారు. దాదాపుగా పునర్నవినే ఈ వారం ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.


ఇక మరోపక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన శిల్పా చక్రవర్తికి ఎలిమినేషన్ కత్తి దూసుకెళ్తుందన్న వార్తలు వస్తున్నాయి. లాస్ట్ వీక్ ఇంట్లోకి వచ్చిన శిల్పా ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ముందు ఇంట్లో ఇంతమంది ఉన్నా తను ఒకదాన్నే అన్న ఫీలింగ్ వస్తుందని అన్నది. అప్పుడే హౌజ్ మెట్స్ అందరు ఆమెను టార్గెట్ చేశారు. అదే చెబుతూ ఈ వారం నామినేషన్స్ లో శిల్పా పేరు ఉంచారు. మరి శిల్పా, పునర్నవిలలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: