తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాతే ఎవరైనా అన్న విషయం సినీ ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే. ఇప్పటివరకు ఆయన్ని మించిన హీరో మరెవరు లేరంటే ఆయన స్టార్ డం ఏంటో అర్థమవుతుంది. సూపర్ స్టార్ ఏం చేసినా ఫ్యాన్స్ కు పండగే. 68 వయసులోనూ ఆయన యంగ్ హీరోలతో పోటీ పడుతుండటమే కాకుండా రెస్ట్ అనేదే లేకుండా సినిమాల్లో నటిస్తూ రాజకీయారంగేట్రానికి రెడీ అవుతుంటే ఫ్యాన్స్ లోనూ అంతే ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం రజనీ దర్బార్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ సహా రకరకాల పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దర్బార్ టైటిల్ కి తగ్గట్టే సూపర్ స్టార్ మేకోవర్ కంప్లీట్ గా కొత్తగా కనిపిస్తోంది.

తాజాగా దర్బార్ సెకండ్ లుక్ సోషల్ మీడీయాలో రివీలైంది. ఇందులో రజనీ పవరేంటో కనిపిస్తోంది. ఈ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అసలు వయసుతో సంబంధం లేకుండా చొక్కా విప్పి రజనీ చూపించిన గ్రేస్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఫోటోకి చిత్ర దర్శకుడు మురుగదాస్ అదిరిపోయే క్యాప్షన్ ని ఇచ్చారు. యంగర్.. స్మార్టర్.. వైజర్.. ఠఫ్పర్.. తలైవార్ నెవ్వర్ సీన్ బిఫోర్ అవతార్ అంటూ మురుగ దాస్ ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో తమిళ సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ కి మన రజనీ చుక్కలు చూపిస్తున్నారే..అంటు కామెంట్స్ పడుతున్నాయి.

దర్బార్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ లో పోలీసాఫీసర్ గా కత్తి పట్టుకుని కనిపించిన రజనీ వేరొక స్టిల్ లో సూటు బూటు తొడిగి దొరలాగా స్టైలిష్ గా కనిపించారు. తాజా లుక్ లో శత్రువుపై కోపంతో ఉగ్ర నరసింహంలా గర్జిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అందుకే రజనీకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీ గత చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ సినిమాని సాహో-సైరా హక్కుల్ని కొనుక్కున్న ఫర్స్ ఫిలింస్ సంస్థ విదేశాల్లో రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాలో నయనతార- నవాబ్ షా- సునీల్ శెట్టి- నివేదా థామస్- యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: