గత పదకొండు రోజులుగా భక్తుల చేత విశేషమైన పూజలందుకున్న లంబోదరుడు గంగ వడిలోకి వడివడిగా తరలిపోతున్నాడు. గణేష్ ఉత్సవాలు చివరి అంకానికి చేరిపోవడంతో భాగ్యనగరం గణేష్ భక్తులతో కళకళలాడుతుంది. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, నృత్యాలు  చేస్తూ హుస్సేన్ సాగర్‌లో గణనాధులను నిమజ్జనం చేయడానికి తరలివెళుతున్నారు.హైదరాబాద్ లో  గణేశ్ నిమజ్జనానికి పోలీస్ అధికారులు  కట్టుదిట్టమైన భారీ ఏర్పాట్లు చేసారు. నగరం అంతా గణేశుడి నిమజ్జనం ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా  ప్రభుత్వ  కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నాయి. పోలీసులు వినాయకచవితి రోజు నుండే పక్కా ప్రణాళికలతో గణేష్ ఉత్సవ కమిటీ అధికారులకి తగిన సూచనలు చేయడంతో నిమజ్జన కార్యక్రమం చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది.ఇకపోతే ..  వినాయకచవితి అనగానే అందరికి భాగ్యనగరంలో భారీ ఖైరతాబాద్ గణనాధుడే గుర్తుకు వస్తాడు. ఖైరతాబాద్ గణేష్ కి ఉన్న మహిమ అలాంటిది.


ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్  శ్రీద్వాదశాదిత్య మహాగణపతిగా భక్తులకి కనులవిందు కలిగించాడు.  మహాగణపతి విగ్రహం 61 అడుగుల ఎత్తు, 45 టన్నులకు పైగా బరువుతో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఈ భారీ గణపతిని గంగ ఒడికి చేర్చారు. ఉదయం 6 :30  కె శోభాయాత్ర ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1 నుండి 1 : 30 నిముషాలకి మధ్య గణేష్ నిమజ్జనం వేలమంది భక్తుల మధ్య ముగిసింది.  ఈసారి మహా గణపతిని సంపూర్ణంగా నిమజ్జనం చేసేందుకు క్రేన్ నెంబర్ 6 దగ్గర 20 ఫీట్లకు పైగా లోతు తీసి మహాగణపతిని సంపూర్ణ నిమజ్జనం చేసారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరైయ్యారు.  


గతంలో ఖైరతాబాద్ గణేశుడు అర్ధరాత్రి దాటిన తరువాత కూడా నిమజ్జనం అయ్యేవాడు. కానీ , తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్  చొరవతో ముందుగా ఈ భారీ బొజ్జ గణపయ్యని నిమజ్జనం చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఖైరతాబాద్ గన్నాధుడిని చివరగా దర్శనం చేసుకోవడానికి నగర ప్రజలు భారీగా ట్యాంక్ బండ్ కి చేరుకోవడం తో ట్యాంక్ బండ్ భక్త జనసంద్రోహంగా మారిపోయింది. ఎటుచూసినా పట్టని జనంతో హుస్సెన్ సాగర్ ఒక సముద్రాన్ని తలపించింది.ఇక హైదరాబాద్ లో ఖైరతాబాద్ తరువాత అంతటి ఫెమ్ కలిగిన గణనాధుడు అంటే బాలాపూర్ గణేష్. బాలాపూర్ గణేష్ అంటే లడ్డుకి చాలా ఫెమ్స్ అని తెలిసిందే. ఈసారి కూడా బాలాపూర్ గణేష్ లడ్డు రికార్డ్ ధర పలికింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డు 17 లక్షల 60 వేల రూపాయలు పలికింది. ప్రస్తుతం బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కన్నులపండుగగా జరుగుతుంది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ముగియడంతో నగరంలోని గణనాధుల శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి.


వివిధ ప్రాంతాల నుంచి గణేశులు నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్ కు తరలివస్తున్నారు. ఇక ఈ ఏడాది గణేష్ ఉత్సవాల కోసం పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా .. నగరంలో నిఘా నీడలో ఉండేలా ఏర్పాట్లు చేసింది. శోభాయాత్ర జరిగే అన్ని మార్గాల్లో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 21 వేల మంది పోలీస్ సిబ్బందితో పాటు ట్రాఫిక్ సిబ్బంది 2100 మంది నిమజ్జనంలో డ్యూటీ చేయనున్నారు. అలాగే 134 మొబైల్ క్రేన్లతో పాటు 93 స్టాటిక్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. ఏదేమైనా గతేడాది జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా చాలా ప్రశాంతంగా నిమజ్జనాలని ముగిస్తున్నారు. మళ్ళీ వచ్చే ఏడాది వస్తా అంతవరకూ సెలవు అంటూ గణనాధుడు గంగఒడిలో సేదదీరడానికి వెళ్ళిపోతున్నాడు..జై గణేశా జై జై గణేశా ...


మరింత సమాచారం తెలుసుకోండి: