మెగా హీరో వరుణ్ తేజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంచె, లోఫర్, ఫిదా, తొలిప్రేమ, ఎఫ్-2 సినిమాలతో ఎలాంటి కథలోనైనా ఇమిడిపోగలడనే విషయం అర్థమైంది. యాక్షన్, కామెడి, ఎమోషన్ ఇలా అన్ని రకాల పాత్రలు పోషించగలడని నిరూపించుకున్నాడు. అందుకే ఈ నెల 20న విడుదలకానున్న వరుణ్ తేజ్ వాల్మీకి మీద మెగా ఫ్యాన్స్ కు మంచి అంచనాలే ఉన్నాయి. కాని రెగ్యులర్ మూవీ గోయర్స్ మాత్రం దీని పట్ల మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరుణ్ వయసుకు మించిన గెటప్ లో తన సాఫ్ట్ ఇమేజ్ కి రిస్క్ అనిపించే బాడీ లాంగ్వేజ్ తో ఎంతవరకు మెప్పిస్తాడో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ కల్ట్ గా నిలిచిపోయిన ఒరిజినల్ తమిళ్ వెర్షన్ జిగర్తాండ సినిమాతో ఎక్కువగా పోల్చుకుంటు డౌట్స్ ని క్రియోట్ చేస్తున్నారు.

వరుణ్ చేసిన గద్దల కొండ గణేష్ పాత్ర అసలు వెర్షన్ లో చేసింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాబీ సింహా. అందుకే ఇమేజ్ లాంటివి ఏవి పెట్టుకోకుండా దర్శకుడు స్వేచ్ఛగా కథను చెప్పాడు. హిట్టు కొట్టాడు. కన్నడంలో విలన్ రవి శంకర్ ను ఈ పాత్రకు తీసుకున్నారు. ఫ్లేవర్ చెడిపోకుండా తానూ దాన్ని సమర్ధవంతంగా పోషించి జనాలను బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఆ ఇద్దరితో పోలిస్తే వరుణ్ తేజ్ అన్ని కోణాల్లోనూ చాలా చాలా చిన్నవాడు. ఇమేజ్ ఫాలోయింగ్ లాంటి అడ్డంకులు కాస్త ఉన్న మాట కూడా వాస్తవమే. 

మరి హరీష్ శంకర్ ప్రయోగాత్మకంగా చేసిన ఈ కమర్షియల్ సినిమా ఎంత వరకు సక్సస్ అవుతుందోనన్న ఆలోచన చాలామందికి ఉంది. వరుణ్ లుక్స్ మీద అటు పాజిటివ్ గానూ నెగటివ్ గానూ రెండు రకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. పైగా తీసుకున్నదేమో ఇతర భాషలో క్లాసిక్ అనిపించుకున్న రీమేక్. డీజే తర్వాత జెన్యూన్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న హరీష్ శంకర్ కు ఇది పెద్ద సవాలేనని చెప్పాలి. ఏ మాత్రం బాలన్స్ తప్పినా తేడా కొట్టేస్తుంది. ఇంకో వారం రోజుల తర్వాత వాల్మీకి అసలు బండారం బయటపడుతుంది. ఎఫ్-2 లాంటి క్లాస్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న వరుణ్ కి హరీష్ శంకర్ వాల్మీకి తో హిట్ ఇచ్చి ఇంకో మెట్టు పైకెక్కిస్తాడా లేక ఉన్న ఇమేజ్ ని కాస్త అమాతం పడగొడతాడా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: