ఏ 1ఎంటర్‌టైన్మెంట్స్ మూవీస్ పతాకంపై రాయల్ చిన్నా, నాగరాజు నిర్మాతలుగా రామ్ రణధీర్ దర్శకత్వం వహించిన చిత్రం 'రాయలసీమ లవ్ స్టోరీ'. వెంకట్, హృశాలి,పావని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ఆడియో వేడుక బుధవారం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి విచ్చేసి ఈ చిత్ర ట్రైలర్ మరియు ఆడియో బిగ్ సీడీ ను ఆవిష్కరించారు.


నిర్మాత చిన్నా మాట్లాడుతూ.. రాయలసీమ అనగానే బాంబులు, ఫ్యాక్షన్ అని మాత్రమే గుర్తుకువస్తాయి అందరికీ.. కానీ వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో తెలపడానికే ఈ చిత్రాన్ని నిర్మించాము.  టీమ్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అవుట్ ఫుట్ కూడా చాలా బాగొచ్చిందని తెలిపారు. 


మరో నిర్మాత నాగరాజు మాట్లాడుతూ.. సినిమా ఫీల్డ్ మాకు సంబంధం లేకపోయినా.. రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ అని అందరూ అనుకుంటారు. కానీ వారు ప్రేమిస్తే ఎలా ఉంటుందో.. అభిమానిస్తే ఎలా ఉంటాయో కూడా ఈ సినిమా ద్వారా తెలియపరచాము. అనుకున్న టైం కు సినిమాను పూర్తి చేసాము. ఈ నెల 27న మా చిత్రాన్ని విడుదల చేయనున్నాము అని చెప్పారు. 


మ్యూజిక్ డైరెక్టర్ సాయి ఎలేంద్ర మాట్లాడుతూ.. అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చి దర్శక నిర్మాతలు ప్రోత్సహించారు. అందుకే మ్యూజిక్ ఇంతబాగా వచ్చింది. సినిమా కూడా చాలా బాగొచ్చింది. మంచి సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. 

దర్శకుడు రామ్ రణధీర్ మాట్లాడుతూ.. సినిమా మొదటి నుంచి మాకు అన్నీ విధాలా ప్రోత్సహిస్తూ వచ్చిన జి నాగేశ్వర్ రెడ్డి గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. సినిమా విషయానికి  వస్తే.. ఒక్క లైన్ చెప్పగానే నన్ను నమ్మి పదిరోజుల్లోనే షూటింగ్ స్టార్ట్ చేయించారు నిర్మాతలు నాగరాజు గారు చిన్నా గారు. చెప్పాలంటే వారు నాకు లైఫ్ ఇచ్చారు. ఈ స్టోరీ కు ఈ టైటిల్ తప్ప ఇంకేదీ సూట్ అవదు. అందుకే రాయలసీమ లవ్ స్టోరీ అని పెట్టడం జరిగింది. అందరికీ ఎంతో నచ్చింది. చాలా పవర్ ఫుల్ స్టోరీ.. ఫుల్ లవ్ ఎంటర్టైనర్.. సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.  సినిమా రిలీజ్ తరువాత ఒక గొప్ప సినిమాగా గుర్తుండి పోతుందని పూర్తి నమ్మకంగా చెప్పగలను అని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: