సునీల్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా మర్యాద రామన్న. ఈ సినిమా సునీల్ కి ఒకరకంగా హీరోగా మంచి రేంజ్ నే ఇచ్చింది. అంతేకాదు ఇప్పటి వరకు జక్కన్న తెరకెక్కించిన సినిమాలన్నిటిలోను మర్యాద రామన్న నే బాగా ఇష్టమని చాలా సందర్భాలలో జక్కన్న చెప్పడం విశేషం. అందుకు కారణం ఈ సినిమాలో ఒక్క సీ.జి షాట్ కూడా లేకపోవడమే. ఇక కొన్ని ఏళ్ల కిందటి నుంచి జక్కన్న తండ్రి బాహుబలి కథకుడు విజయేంద్ర ప్రసాద్ దగ్గర ఓ కథ పక్కన సపరేట్ గా ఉంది. ఆ కథను అప్పట్లో కమెడియన్ కమ్ హీరో సునీల్ తో తీయాలని అనుకున్నారు. కథ చెప్పడం తో పాటు, కొన్ని రోజులు ఈ కథ మీద డిస్కషన్లను కూడా నడిచాయి. కానీ ఎందుకనో కథ అక్కడే ఆగిపోయింది తప్ప అంతకన్నా ముందుకు వెళ్లలేదు. ఆ తరువాత అందరు దీని గురించి మర్చిపోయారు.
 
లేటెస్ట్ గా విజయేంద్ర ప్రసాద్ కథతో కమెడియన్ కమ్ హీరో సప్తగిరి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు స్వర్ణ సుబ్బారావు అనే డైరక్టర్ పని చేస్తున్నారు. ఈ డైరెక్టర్ కి కేవలం ఒకే ఒక్క సినిమాని తెరకెక్కించిన అనుభవం మాత్రమే ఉంది. విజయేంద్ర ప్రసాద్ కథ ఇవ్వడంతో పాటు ఎలాగూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారు. అందుకే ఈ సినిమాకి చిన్న డైరక్టర్ ను తీసుకున్నారని తెలుస్తుంది. పైగా హీరో సప్తగిరి కాబట్టి అంత పేరున్న డైరెక్టర్ అవసరం లేదు గనక ఇతన్ని ఎంచుకున్నారని అర్థమవుతుంది. బడ్జెట్ కూడా బాగా తక్కువేనని సమాచారం.

ఫ్లాప్స్ లో ఉన్న సప్తగిరి హీరోగా నిలదొక్కుకోవాలని చాలానే ట్రయ్ చేస్తున్నారు. అయినా ఒక్క హిట్ పడడంలేదు. ఈ టైమ్ లో విజయేంద్ర ప్రసాద్ కథ, ప్రాజెక్టు అంటే కాస్త ఆశలు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ బాగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే రాజమౌళికి కాకుండా తెలుగులో విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథలు పెద్దగా వర్కవుట్ కావడం తక్కువ. మరి సప్తగిరి అయినా వర్కౌట్ అవుతుందో లేదో. 


మరింత సమాచారం తెలుసుకోండి: