నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ఈరోజు విడుదలైంది. హీరో కార్తికేయ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించాడు. మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తుంది. నాని నుండి ప్రేక్షకులు ఎలాంటి సినిమాను కోరుకుంటున్నారో అలాంటి సినిమాను నాని ఇచ్చాడని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
కథ విషయానికి వస్తే బ్యాంకులో జరిగిన దొంగతం కేసును చేధించటం కొరకు ఐదుగురు ఆడవాళ్లు పెన్సిల్ పార్థసారథిని (నాని) కలుస్తారు. నానితో కలిసి ఈ గ్యాంగ్  బ్యాంకులో జరిగిన దొంగతనాన్ని చేధించారా? ఆ దొంగతనానికి దేవ్(కార్తికేయ) కు ఉన్న సంబంధం ఏమిటి ? అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలో ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కామెడీ సీన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. 
 
కార్తికేయ ఎంట్రీతో కథలో వేగం పెరుగుతుంది. సెకండాఫ్ లో ట్విస్టులు సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాలో సెకండాఫ్ హైలెట్ గా నిలిచింది. సినిమాలో సంగీతం కంటే నేపథ్య సంగీతం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ మరోసారి తన సినిమాతో అద్భుతం చేసాడని చెప్పవచ్చు. ప్రధాన పాత్రలకు తగిన నటీనటుల్ని ఎంచుకోవటంతోనే విక్రమ్ సగం సక్సెస్ అయ్యాడు. 
 
కథ, కథనం విషయంలో విక్రమ్ కె కుమార్ చాలా జాగ్రత్తలే తీసుకున్నాడు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సీన్లు మరికొన్ని ఉంటే బాగుండేది. సాహో సినిమా విడుదలై రెండు వారాలు కావటం మరియు మార్కెట్లో గ్యాంగ్ లీడర్ సినిమాకు పోటీనిచ్చే మరే సినిమా లేకపోవటం కూడా గ్యాంగ్ లీడర్ సినిమాకు ప్లస్ కానుంది. చాలా కాలం తరువాత నాని ప్రేక్షకులు తననుండి ఎలాంటి సినిమాను ఆశిస్తారో అలాంటి సినిమాను ఇచ్చాడని చెప్పవచ్చు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: