బిగ్ బాస్ లో మొదటి నుండి గమనిస్తే నామినేషన్స్ కి మొదటిసారి వచ్చిన వారందరూ ఎలిమినే అయ్యారు. తమన్నా నుండి ఆలీ వరకు అందరూ అలా ఎలిమినేట్ అయిన వారే. ఆలీ కూడా ఈ విషయాన్ని నాగార్జున గారి ముందు చెప్పాడు. మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చి ఎలిమినేట్ అవడం అనేది సెంటిమెంట్ లా మారింది. ప్రస్తుతం నామినేషన్స్ లో పునర్నవి, మహేష్, శ్రీముఖి, శిల్పా చక్రవర్తి, హిమజ లు ఉన్నారు. వీరందరిలో ఒక్క శిల్పా తప్ప మిగతా అందరూ నామినేషన్స్ ని ఫేస్ చేసినవారే.


 
శిల్పాకి తప్ప మిగతా అందరికీ ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దాంతో వాళ్లకి ఓట్లు ఎక్కువగా పడే ఛాన్స్ ఉంది. వారం రోజుల క్రితం వచ్చిన శిల్పాకి ఫ్యాన్ ఫాలోయింగ్ అస్సలు లేదు. అదీగాక హౌస్ మేట్స్ ఆమె రాకని పెద్దగా స్వాగతించినట్లు కూడా కనబడలేదు. ఏదో చుట్టపు చూపుగా వచ్చింది కొన్ని రోజులు ఉండి వెళ్తుంది అన్న మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. టాస్క్ లో ఆమె వంద శాతం ఎఫర్ట్ పెట్టినా ఫలితం లేకుండా పోతుంది. ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్లే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా కూడా ఆలీ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.


శిల్పా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా కాదు. వచ్చిన వారం రోజుల్లో అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. నామినేషన్స్ లో ఉన్న అందరినీ దాటి శిల్పాకి ఓట్లు పడాలంటే ఏదో మిరాకిల్ జరగాలి. మిగిలిన ఒక్కరోజులో అలాంటి అద్భుతం జరిగే అవకాశాలు కనబడట్లేదు. కాబట్టి ఆలీ చెప్పినట్టు సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అయ్యి శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సీజన్ కి వైల్డ్ కార్డ్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. తమన్నా సింహాద్రి, శిల్పా చక్రవర్తి వీరిద్దరు బిగ్ బాస్ హౌస్ కి అతిధులే తప్ప కంటెస్టెంట్స్ కాదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: