తమిళ నటుడు సూర్యకు గత కొంత కాలంగా ఏది కలిసి రావడం లేదు . ఆయన నటించిన సినిమాలు సరిగా ఆడటం లేదు, ఒకప్పుడు సూర్య కు తెలుగు హీరోలకు సమానంగా మార్కెట్ ఉండేది. ఆయన నటించిన సినిమాలకు తమిళం తో  పాటు తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉండేది. సూర్య నటించిన చివరి సినిమా నంద గోపాలకృష్ణ దారుణంగా ఫ్లాప్ అయ్యింది.

ప్రస్తుతం రంగం ఫేం కెవి ఆనంద్ దర్శకత్వంలో "కాప్పన్" తెలుగులో "బందోబస్తు" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫిల్మ్ మేకర్ జాన్ చార్లెస్ ఈ కథ తనదే అని, కెవి ఆనంద్ కాపీ కొట్టి తీశారంటూ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు గురువారం(సెప్టెంబర్ 12)న మద్రాస్ హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ కేసు కోర్ట్ కొట్టివేసింది. 

ఈ  సినిమా విడుదలకు ఎలాంటి సమస్య లేకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. బందోబస్తు ప్రీమీయర్ షో టాక్ ప్రకారం సినిమా బాగుందని.ఈ సారి సూర్యకు హిట్ ఖాయమని అంటూన్నారు.ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. సూర్య  ఒక అండర్ కవర్ పోలీసు ఆపీసర్ గా నటిస్తున్నాడు. మలయాళ నటుడు మోహన్ లాల్ భారత దేశ ప్రధాని పాత్రలో కనిపించనున్నాడు.

ఈ చిత్రంలో , ఆర్య, సాయేషా సైగల్, బోమన్ ఇరానీ, చిరాగ్ జైన్, పూర్ణ, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బందోబస్తు సినిమా హై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రాఫర్‌గా అభినందన్ రామానుజం, ఎడిటర్‌గా ఆంథోనీ పని చేస్తున్నారు.సూర్య సినీ కెరియర్ కి ఈ సినిమా విజయం చాలా ముఖ్యం . బందోబస్తు సినిమా ఈ నెల 20 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: