సహజనటిగా పేరు తెచ్చుకున్న జయసుధ ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ఆమె సినిమాలో ఉంటే అది పెద్ద అసెట్ అని భావించిన దర్శక నిర్మాతలు ఉన్నారు. తన అనుభవం, సీనియారిటీతో జయసుధ వందల సినిమాల్లో నాటి, నేటి హీరోలతో నటించి ఘనమైన పేరు సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా జయసుధ ఈ మధ్యనే వైసీపీలో చేరి  ఆ పార్టీ విజయంలో తన వంతు క్రుషి చేశారు.



జయసుధ కుటుంబంలో ఆ మధ్యన ఓ విషాదం జరిగింది. ఆమె భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకోవడంతో కొన్నాళ్ళు ఆమె పూర్తిగా డల్ అయిపోయారు. తిరిగి ఇపుడే జీవితంలో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక జయసుధ నితిన్ కపూర్లకు ఇద్దరు పిల్లలు. నీహార్ కపూర్ బిజినెస్ మ్యాన్. రెండవ కొడుకు శ్రీయా కపూర్ ఓ సినిమాలో నటించాడు.ఇదిలా ఉండగా పెద్ద కొడుకు నీహార్ కపూర్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. డిల్లీకి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అమృత్ కౌర్ ని అతడు వివాహమాడనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ముహూర్తం ఫిక్సయ్యింది. ఈ పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలని జయసుధ డిసైడ్ అయింది.


టాలీవుడ్లో ఎంతో అనుబంధం ఉన్న జయసుధకు నార్త్ ఇండస్ట్రీతో కూడా  మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే రాజకీయాల్లో కూడా ఆమె ఉన్నందువల్ల  అక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున సెలిబ్రిటీలు వచ్చే అవకాశం వుంది. మొత్తం మీద జయసుధ ఇంట పెళ్ళి అంటే టాలీవుడ్ కి ఓ పండుగే అంటున్నారు. నాటి నేటి తారాగణమంతా ఒకేచోట కలిసే అవకాశం ఉందని కూడా అంటున్నారు.  సినిమాల్లో ఎన్నో అత్త పాత్రలు పోషించిన జయసుధ నిజజీవితంలో అత్త అవుతున్నారన్నమాట.  అల్ ద్ బెస్ట్ మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: