నాని ‘గ్యాంగ్ లీడర్’ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈమూవీ సక్సస్ గురించి నాని ఎంతో టెన్షన్ పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈరోజు ఉదయం నాని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో పై సెటైర్లు పేలుతున్నాయి. ఈమూవీలో మరొక కీలక పాత్ర పోషించిన సీనియర్ నటి లక్ష్మి భుజం పై తలపెట్టి పడుకుని ఉన్న నాని ఫోటోను షేర్ చేస్తూ ‘ఈమూవీ హిట్ అయ్యాక నిద్ర లేపండి’ అంటూ కామెంట్ పెట్టాడు.

ఇప్పుడు నాని చేసిన కామెంట్ పై సెటైర్లు పేలుతున్నాయి. ‘గ్యాంగ్ లీడర్’ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ టాక్ బయటకు రావడంతో ఈ మూవీ పై కూడ డివైడ్ టాక్ వచ్చినట్లు అర్ధం అవుతోంది. దీనితో నాని కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ ‘గ్యాంగ్ లీడర్’ ఇచ్చే అవకాశం లేదు అని విశ్లేషకులు అంటున్నారు. 

ఈ మూవీ సూపర్ హిట్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి నాని ‘ఇప్పట్లో నిద్ర లేవడా’ అంటూ సెటైర్లు పడుతున్నాయి.ఇది ఇలా ఉండగా ఈ సినిమా చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ చాల డీసెంట్ గా ఉందని కొంతమంది చెపుతూ ఉంటే ఈమూవీ సెకండ్ ఆఫ్ అంత గొప్పగా లేదని సన్నివేశాలలో ఎక్కడ లాజిక్ లేకుండా ఉండటంతో ఈమూవీ సెకండ్ ఆఫ్ పై విక్రమ్ కుమార్ మరింత దృష్టి పెడితే నాని కోరుకున్న సూపర్ హిట్ దక్కి ఉండేది అని కామెంట్ చేస్తున్నారు. 

దీనితో ఈమూవీకి ఎవరేజ్ టాక్ మాత్రమే ఖాయం అని అంటున్నారు. నాని కోరుకున్న 50 కోట్ల కలక్షన్స్ రేంజ్ స్థాయికి ఈ మూవీ చేరడం కష్టం అని అంటున్నారు. దీనితో నాని నటిస్తున్న సినిమాలకు ప్రశంసలు వస్తున్నాయి కాని రికార్డులను అందుకోలేక పోవడంతో నాని హీరోగా మరో మెట్టు ఎక్కే అవకాశం కోసం మరికొంత కాలం వెయిట్ చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: