నాని సినిమా అంటే ఓ కొత్త తరహా కథ, దానికి కామెడీ ట్రీట్మెంట్, ఓ మోస్త‌రు ఎమోషన్ కలగలిపిన ప్యాకేజి. డైరక్టర్ విక్రమ్ కే కుమార్ ది ఓ డిఫరెంట్ స్కూల్. కొత్త నేపధ్యం, వెరైటీ ట్విస్ట్ లు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగలిగిన లగేజి. మ‌రి వీరిద్ద‌రి కాంబినేష‌న్ అంటే ఇంకెలా... ఎంత‌లా ఊహించుకుంటాం. గ్యాంగ్ లీడ‌ర్ సినిమా రిలీజ్‌కు ముందు కూడా భారీ అంచనాల‌తో అందరూ ఊహించేసుకున్నారు.


తాజాగా నాని - విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన గ్యాంగ్ లీడ‌ర్ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. వాస్త‌వంగా చెప్పాలంటే వీరిద్ద‌రి చివ‌రి సినిమాలు అంచ‌నాలు అందుకోలేదు. విక్ర‌మ్ అక్కినేని వార‌సుడు అఖిల్‌తో చేసిన హ‌లో మంచి సినిమాగా ప్ర‌శంస‌లు అందుకున్నా ప్లాప్ అయ్యింది. క‌మ‌ర్షియ‌ల్‌గా ఆ సినిమా భారీ న‌ష్టాలు మిగిల్చింది. ఇక ఇటు నానికి మాత్రం గ్యాంగ్ లీడ‌ర్ మంచి సినిమాగా మిగిలింది.


గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలో మంచి కామెడీ, యాక్ష‌న్‌, ఎమోష‌న్‌, సూప‌ర్బ్ ట్విస్టులు ఇలా అన్ని మిక్స్ చేసి ప‌డేశాడు విక్ర‌మ్‌. ఇక నాని న‌ట‌న సినిమాను మ‌రో లెవ‌ల్‌కు తీసుకు వెళ్లింది. వాస్త‌వంగా అఖిల్‌తో విక్ర‌మ్ చేసిన హలో సినిమా కూడా మంచి క‌థ‌తో వ‌చ్చిందే. అయితే ఆ క‌థ‌లో కొంద‌రు వేలుపెట్టి కెలికేసి కిచిడీ చేయ‌డంతో చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్‌కు స‌హ‌నం న‌శించి పోయి త‌నకు తోచిన‌ట్టు తీసుకుపోయాడ‌న్న టాక్ కూడా అప్ప‌ట్లో వినిపించింది.


ఇప్పుడు ఓ మోస్తరు క‌థ‌తో కూడా విక్ర‌మ్ త‌న‌పై ప్రెజ‌ర్ లేక‌పోతే ఎంత అద్భుతంగా తీసి చూపిస్తానో గ్యాంగ్ లీడ‌ర్‌తో ఫ్రూవ్ చేశాడు. ఇక నాని ట్యాలెంట్ కూడా ఇందుకు బాగా యూజ్ అయ్యింది. ఏదేమైనా నాని నుంచి చాలా రోజుల త‌ర్వాత మాంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ఎంజాయ్ చేసే సినిమా వ‌చ్చింది. ఇక విక్ర‌మ్ అక్కినేనికి అచ్చిరాక‌పోవ‌డానికి... నానికి అదిరిపోయే హిట్ ఇవ్వ‌డానికి కార‌ణం కెలుకుడే అన్న‌ది ఈ సినిమా రిజ‌ల్ట్‌తో స్ప‌ష్టంగా తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: