నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా పై అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండడంతో ఆ సినిమా యూనిట్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. పెన్సిల్ పార్ధసారధి అనే పాత్రలో నాని నటన ఎంతో బాగుందని, సినిమా చూసిన వారిలో ఎక్కువమంది ప్రేక్షకులు చెప్తున్నా మాట. అయితే సినిమాలో కేవలం నాని మాత్రమే కాక, ఇతర నటీనటులు కూడా తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకుని సినిమా విజయంలో కీలక పాత్ర వహించారట.


సీనియర్ నటి లక్ష్మి, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, శరణ్య మోహన్, కార్తికేయ, వెన్నెల కిషోర్ తదితరులు తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారని, అయితే సినిమాలో అక్కడక్కడా కొద్దిపాటి లోపాలు ఉన్నప్పటికీ, వర్ ఆల్ గా చూస్తే అవి చాలా చిన్నవిగా కనపడతాయి అని అంటున్నారు మెజారిటీ ప్రేక్షకులు. ఇక అనిరుద్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కూబా ఫోటోగ్రఫీ, సినిమాలో చాలా బాగున్నాయట.

ఎక్కడా కూడా వల్గారిటీ లేకుండా కుటుంబంలో చిన్న పిల్లల దగ్గరినుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ సినిమాను చూడవచ్చని చెప్తున్నారు. నిజానికి ఈ సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు ఉండడం, దర్శకుడు ఎక్కడా కూడా కథ, కథనాలు ప్రక్కదారి పట్టించకుండా దీనిని తెరకెక్కించడం వల్లనే సినిమా ఇంత మంచి టాక్ సంపాదించి, అంచనాలు మించేలా ముందుకు సాగుతుందని అంటున్నారు. ఇకపోతే గ్యాంగ్ లీడర్ అని ఈ సినిమాకు టైటిల్ పెట్టినపుడు గతంలో మెగాస్టార్ నటించిన సినిమా టైటిల్ కావడంతో, నాని ఆ పేరుకు ఎంతవరకు న్యాయం చేస్తారో అని చాలామంది భావించారని, 

అయితే గ్యాంగ్ లీడర్ అంటే కేవలం హీరో నానినే కాదు, మొత్తం సినిమాలోని కథ, కథనం, ఇతర నటీనటులు అలానే సాంకేతిక నిపుణుల గొప్ప పని తీరు అనే విధంగా ఈ సినిమా తెరకెక్కి, ఈ రోజున వారందరి నిజమైన శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటోందని పలువురు సినిమా విశ్లేషకులు సినిమాపై పొగడ్తలు కురిపిస్తున్నారు. ప్రేక్షకుడికి కావలసింది హంగు, ఆర్భాటాలు, భారీ ఖర్చు, సెట్టింగులు వేసిన సినిమాలు కాదని, రెండున్నర గంటల పాటు వారు ఏ వినోదం కోసం అయితే థియేటర్ కు వస్తారో, ఆ వినోదాన్ని వారికి అందించి సంతుష్టులను చేయగలగలగడమే అని, ఆ విధంగా చూస్తే ప్రేక్షకుడిని నూటికి నూరుశాతం సంతృప్తి పరిచిన సినిమా గ్యాంగ్ లీడర్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని వారు అంటున్నారు. ఇక ఈ సినిమా అద్భుత విజయంతో నాటి గ్యాంగ్ లీడర్ సినిమా పేరుని నిలబెట్టిన స్టార్ గా నాని మంచి పేరు సంపాదించారు...!!  


మరింత సమాచారం తెలుసుకోండి: